Chandra babu: రాష్ట్ర ఆదాయం అలాగే అప్పుల పై ఏపీ ప్రజలకు వివరించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు అంశాలపై శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన సీఎం ఇంకో వారం రోజుల్లో ఆర్థిక శాఖ పై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ఆర్థిక శాఖ పై సమీక్షలో సీఎం కి వివరించారు చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు విడుదల చేశారు చంద్రబాబు. మరో శ్వేత పత్రం రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 18న ఆర్థిక శాఖ రిలీజ్ చేయబోతున్నారు.
Chandrababu focused on that
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పులు కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక అంశాలు బడ్జెట్ పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయం అలాగే అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019 – 24 మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు ఆఫ్ బడ్జెట్ తో పాటుగా కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలపై ఆరా తీశారు ఇప్పటిదాకా అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లకు పైనే ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
Also read: Home Loan: ఆర్బీఐ కొత్త రూల్.. హోమ్ లోన్స్‌పై తగ్గిన ఛార్జీలు..!
ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు, ఏ శాఖలు లో నిధులు ఇతర పనులకు మళ్ళించారు అనే దాని గురించి వివరాలు ఇవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు అన్నారు. మరోవైపు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయని దాని గురించి సీఎం చంద్రబాబు నాయుడు ని అడిగి తెలుసుకున్నారు. పలు శాఖల నుండి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎం కి చెప్పారు (Chandra babu).