Mirzapur 3 Star Neha Sargam Gains Massive Following

Mirzapur 3: మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం OTTలో దుమ్ము రేపుతోంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇప్పటికే పలువురు సినీ తారలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు నటీనటులందరికీ మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఓ సినీ స్టార్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ సిరీస్ ద్వారా ఈ బ్యూటీ పేరు ఇప్పుడు ఇండియా మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు ఈ స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఆమె ఎవరని మీరు అనుకుంటున్నారు? మిర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్‌లో దాదా త్యాగి కోడలు సలోని త్యాగిగా నటించిన నేహా సర్గం గురించే. దాదా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్య గా ఈ సిరీస్‌లో కనిపిస్తుంది.

Mirzapur 3 Star Neha Sargam Gains Massive Following

సలోని త్యాగి పాత్రలో బ్యూటీ నేహా సర్గం నటించింది. ఇప్పుడు ఈ క్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీ గా పెరిగింది. మీర్జాపూర్ 3 సిరీస్ ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమలో చాలా ఫేమస్. నేహా బీహార్‌లోని పాట్నాకు చెందినది. పాట్నాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, ఆమె తన తల్లి మరియు సోదరితో కలిసి ముంబైకి వెళ్లింది. సినీ పరిశ్రమలో గాయని కావాలనుకుంది. ఈ క్రమంలో ఆమె ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌లో పాల్గొంది. అయితే అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా షో నుంచి తప్పుకుంది.

Also Read: Xiaomi SU7 Electric: యామీ తొలి SU7.. సింగిల్‌ చార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజీ

తర్వాత రాజన్ షాహి తన సీరియల్ కోసం నేహాకి కాల్ చేసి ఆమెకు మరో ఆఫర్ ఇచ్చాడు. కానీ నేహా తల్లితండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. ఈ పరిస్థితిలో, రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి చాంద్ చూచా బాదల్ మే సీరియల్‌లో నటించదానికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ఆ తర్వాత, నేహా సుదీర్ఘ విరామం తీసుకుంది. 2012లో రామాయణం: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్‌లో సీత పాత్రను పోషించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సిరీస్‌లో కనిపించిన నటుడు నీల్ భట్ రామాయణం సిరీస్‌లో కూడా కనిపించాడు. ఈ సిరీస్‌లోనే ఇద్దరూ కలుసుకున్నారు, ప్రేమలో పడ్డారు మరియు మూడేళ్ల డేటింగ్ తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

నేహా సర్గం ప్రధానంగా పౌరాణిక నాటకాలలో నటిస్తుంది. ఆమె రామాయణం, యశోమతి మైయ, పరమావతార్ శ్రీకృష్ణ మొదలైన సీరియల్స్‌లో నటించింది. ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపునిచ్చింది.

https://www.instagram.com/nehasargam/?hl=en