BRS: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకనాడు తండ్రి కొడుకుల్లాగా ఉండే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అది ఎంతలా అంటే ముఖముఖాలు కూడా చూసుకోవడానికి ఇష్టపడలేదు అంటే ఇద్దరూ. మొన్నటిదాకా ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారట. కానీ ఇటీవల పోచారం గులాబి టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ వీడడానికి ప్రశాంత్ రెడ్డి ఓ కారణమని చెబుతున్నారట పోచారం సన్నిహితులు. జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి కెసిఆర్ ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసే వారిని…. అలాంటిది పోచారం ఇప్పుడు పార్టీ మారడం ఒక విధంగా టిఆర్ఎస్ కు షాక్ అనే టాక్ వినిపిస్తోంది. BRS

Pocharam Srinivasa Reddy big plan to hit BRS

అటు మాజీ స్పీకర్ వర్గం మాత్రం ఆయన పార్టీ మార్పులకు బలమైన కారణం ఉందని అంటుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం జెండా మార్చేశారని అంతా అనుకుంటున్నా…. ఇంటర్నల్ మ్యాటర్ మాత్రం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ రెడ్డి వ్యవహార శైలి పోచారం మనసును గాయపరిచిందట. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా…. ఆయన నుంచి ఆశించిన స్థాయి స్పందన లేదని దీంతో తీవ్ర మనస్థాపం చెంది పోచారం పార్టీ మారారు అన్నది ఆ పార్టీ క్యాడర్ వాయిస్. కారణాలు ఏమైనా పోచారం పార్టీ మారడం మాత్రం జిల్లాలో గులాబీ పార్టీ కి గట్టి దెబ్బ అన్నది రాజకీయ పరిశీలకుల మాట. పాలు నీళ్లలాగా కలిసిపోయే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య బీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం అంశం చిచ్చు పెట్టిందట. పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి డిసిసిబి చైర్మన్ కాగా…. ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రమేష్ రెడ్డి వైస్ చైర్మన్. BRS

Also Read: Jagan: జగన్ మెడకు చుట్టుకుంటున్న తోపుదుర్తి కక్కుర్తి స్కామ్ లు.. ఏకంగా 200 కోట్లు.?

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రమేష్ రెడ్డి సొంత పార్టీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస అవిశ్వాసం పెట్టి పని గట్టుకొని మరి భాస్కర్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలని తప్పించారన్నది ప్రచారం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామం వేల్పూరు సొసైటీ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డి పై అవిశ్వాసం పెట్టాలని కోరారట పోచారం శ్రీనివాసరెడ్డి. కానీ ప్రశాంత్ రెడ్డి నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో మాజీ స్పీకర్ హార్ట్ అయినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతపై అవిశ్వాస తీర్మానం పెట్టి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన చర్యలు తీసుకోలేదంటూ పార్టీ అధినేతలు ఫిర్యాదు చేశారట పోచారం. కానీ అటు నుంచి కూడా సేమ్ రిజల్ట్ వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. BRS

ఓవైపు కొడుకు భవిష్యత్తు…. మరోవైపు తన మాటకు విలువ లేకుండా పోవడానికి పోవడాన్ని జీర్ణించుకోలేక ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనివార్యంగా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు అన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. సరే జరిగింది ఏదో జరిగింది అని అనుకునే లోపే తన మార్క్ అసలు సిసలు రాజకీయం మొదలు పెట్టారట మాజీ స్పీకర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యేతో మంతనాలు పూర్తవగా ….ప్రశాంత్ రెడ్డితో విభేదించే నేతలను వే ఏకంరు చేసి….ఆయనను ఒంటరి చేయాలన్న వ్యూహానికి పదును పెడుతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇన్నేళ్లు ఒకే పార్టీలో ఉండి తండ్రి కొడుకు లాగా మెలిగిన నేతల మధ్య ఏర్పడిన వైరంలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. BRS