Sai Pallavi Missed chance of Allu arjun pushpa

Sai Pallavi: కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతుంది. సాయి పల్లవి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఓ భారీ సినిమా ఆఫర్ వచ్చింది. “ఫిదా” సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ క్యూట్ గర్ల్ తెలుగు ప్రేక్షకులచేత వావ్ అనిపించింది. మంచి సినిమాలు చేసి  ఆమెకు చాలా మంది అభిమానులు అయ్యేలా చేసుకుంది. ఇప్పుడు అందరు హీరోయిన్లు ఈ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.. కానీ సాయి పల్లవి మాత్రం ఈ దారిలో వెళ్లకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ఉన్న సినిమాలుచేస్తూ వచ్చింది. అయితే ఆమెకు ఎక్కువ సినిమా అవకాశాలు రానీయకుండా చేసిందని చెప్పొచ్చు.

Sai Pallavi Missed chance of Allu arjun pushpa

ఇది ఇలా ఉంటే సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమాని మిస్ చేసుకుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వచ్చినా సాయి పల్లవి ఆ అవకాశాన్ని చేజార్చుకుందట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్. అవును, సాయి పల్లవి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉండగా ఆ కాంబినేషన్ సెట్ కాలేదని తెలుస్తోంది. అదే పుష్ప చిత్రం.

Also Read: Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” విడుదలైన అన్ని భాషలలో విజయవంతమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని సుకుమార్ ముందుగా అనుకున్నాడట. అయితే సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఎక్స్ పోజింగ్ చేయాల్సి రావడంతో సాయి పల్లవి ఆ పాత్రను వదులుకుందట.

దాంతో ఈ అవకాశం రష్మికకు దక్కింది. ఇందులో సాయిపల్లవి నటిస్తే సినిమా మరింత బాగుండేదని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే చిత్రాన్ని చేస్తుంది సాయి పల్లవి. అలాగే బాలీవుడ్ రామాయణంలోనూ సీత పాత్రను పోషిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.