Nara Brahmani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం… 164 స్థానాలు సంపాదించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. Nara Brahmani

nara brahmani as Telangana tdp chief

ఇక ఏపీలో అధికారంలోకి రావడంతో…. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో… సీఎం చంద్రబాబు సమావేశం అయిన మరునాడు… ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ టిడిపి నేతలు అందరూ.. చంద్రబాబును కలిసేందుకు ముందుకు వచ్చారు. అన్ని పార్టీల లీడర్లు కూడా చంద్రబాబును కలిసి… శుభాకాంక్షలు తెలిపారు. Nara Brahmani

Also Read: Jagan: జగన్ పై కడప ఎంపీఅవినాష్ తిరుగుబాటు ?

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ లాగానే… తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని… చంద్రబాబు నాయుడు తెలిపారు.త్వరలోనే.. టిడిపి పార్టీ పుంజుకుంటుందని వివరించారు.అయితే.. ఈ తరుణంలోనే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నందమూరి తారకరామారావు మనవరాలు… బాలయ్య కూతురు బ్రాహ్మణికి… తెలంగాణ టిడిపి బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. Nara Brahmani

మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ కోసం ఏపీలో… ఎంతో కష్టపడి ప్రచారం చేశారు నారా బ్రాహ్మణి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో… నారా బ్రాహ్మిని చేసిన ప్రచారం అంతా కాదు. ఫలితంగా నారా లోకేష్ విజయం సాధించాడని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తెలంగాణలో… టిడిపి బాధ్యతలు నారా బ్రాహ్మణునికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట. Nara Brahmani