Ananth Ambani: ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మార్చిలో ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరిపిన ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మరోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. అంతేకాదు జియో కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల వెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ సినీ తారలతో పాటు దక్షిణాది నుండి ఎంతోమంది స్టార్ హీరోలు కూడా హాజరయ్యారు.
That small diamond on Ananth Ambani kurta cost all crores
అయితే ఈ నేపథ్యంలోనే అనంత్ అంబానీ తన చొక్కాకి పెట్టుకున్న ఒక వజ్రం ధర నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ అంబానీ చొక్కాకి పెట్టుకున్న ఆ వజ్రం ధర ఎంత..దాని స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి జులై 12 అనగా నిన్న జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకల్లో జులై 11వ తేదీన జరిగిన ఫంక్షన్ లో అనంత్ అంబానీ ఎరుపు రంగుకుర్తాలో కనిపించారు. అయితే ఎరుపు రంగు కుర్తా కి పెట్టుకున్న బ్లూ డైమండ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.( Ananth Ambani )
Also Read: RGV: ఆర్జీవి కళ్ళముందే తన లవర్ తో రొమా** చేసిన హీరో.. కోపంతో ఏం చేశాడంటే.?
ఎందుకంటే చూడ్డానికి అంత చిన్నగా ఉన్న వజ్రం ధర ఏకంగా ఆరు కోట్లకు పైగానే అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వజ్రం అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి అయినటువంటి ఎలిజిబెత్ పెట్టుకున్న వజ్రం లాంటిదే అని తెలుస్తోంది. అలాగే ఈ బ్లూ వజ్రం ఖరీదు దాదాపు నాలుగు కోట్లకు పైగానే ఉంటుంది అని వజ్ర వ్యాపారులు అంటున్నారు. అలాగే ఈ వజ్రంపై పులి బొమ్మ ఉంది.ఆ పులిబొమ్మపై నలుపు రంగులో చుక్కలు ఉన్నాయి.
అయితే అవి మీరు అనుకుంటున్నట్లు పెయింటింగ్ చుక్కలు కాదు. ఆ పులి బొమ్మలో కనిపిస్తున్న నల్లటి చుక్కలు 604 వజ్రాలట. అలాగే ఆ డైమండ్ పై ఉన్న పులిబొమ్మని 18 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో తయారు చేశారట. ఇక పులికి ఉన్న రెండు కళ్ళు కూడా వజ్రాలే. ఇలా మొత్తంగా అనంత్ అంబానీ తన చొక్కాకి పెట్టుకున్న ఆ బ్లూ డైమండ్ కాస్ట్ ఏకంగా ఆరు కోట్లకు పైగానే అని తెలుస్తోంది. ఇక ఇదే బ్లూ డైమండ్ ని గతంలో అనంత్ అంబానీ తన ఎంగేజ్మెంట్ వేడుకల్లో కూడా పెట్టుకున్నారు.( Ananth Ambani )