Veena Srivani at Anant Ambani Marriage

Veena Srivani: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శుక్రవారం (జూలై 12) సాయంత్రం రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ వివాహం జరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అదే సమయంలో, వివాహానికి వచ్చిన అతిథులను అలరించడానికి అంబానీ కుటుంబం పాపులర్ అయిన దేశీ మరియు విదేశీ గాయకులను మరియు జస్టిన్ బీబర్ వంటి వారిని కూడా ఆహ్వానించింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యారు.

Veena Srivani at Anant Ambani Marriage

ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుకలో వీణ వాయించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.ఇది తెలుగు వారికి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా కోసం ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేసిన ఈ వేదిక అద్భుతం ఉంది. మన తెలుగు సంస్కృతి నుంచి వచ్చాను కాబట్టి నీతా అంబానీ కూడా ఎంతో గౌరవించారు అని ఆమె చెప్పారు.

అంబానీ కుటుంబం నాకు చాలా నచ్చింది. వారు నన్ను చాలా గౌరవిస్తారు. వీణా శ్రీవాణి మాట్లాడుతూ తనను వారు బాగా చూసుకున్నారని, ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఆయన భార్య వేణు శ్రీవాణి కూడా వేణు స్వామి పుణ్యమా అని ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. వీణ తో ఆమె పాడే పాటను వినడానికి మరియు ఆమె చిరునవ్వు కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

Also Read : Bharateeyudu2: మొదటి రోజు భారతీయుడు 2 కి ఎంత వచ్చిందంటే.. ఇంత పెద్ద దెబ్బ పడిందే!! 

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు.. భక్తిగీతాలు మరియు సినిమా పాటలను వీణపై వాణి శ్రీవాణి ప్లే చేయడంలో ఆమెకు ఆమె సాటి.ఆమె ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయి. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అలా ఇప్పుడు అంబానీ పెళ్లిలో వీణ వాయిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది వీణా శ్రీవాణి.