Pan World Movies on the way for telugu cinema 

Pan World Movies: ఇండియా లో బాలీవుడ్ సినిమానే టాప్. ఆ సినిమాల్లో కనిపించాలని ప్రతి ఒక్క నటులు కూడా అనుకునేవారు. అయితే తాజా పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు తెలుగు చిత్రంలో కనిపించడానికి పెద్ద లైన్ ఉంది అంటే ఆశ్చర్యపోక తప్పదు. తెలుగు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం అన్ని భాషల నటీనటులు ఎదురు చూస్తున్నారు. కానీ కథ అక్కడితో ముగియలేదు ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు కొంతమంది సినిమా పండితులు.

Pan World Movies on the way for telugu cinema 

తెలుగు సినిమాలు మొత్తం భారతీయ మార్కెట్‌ను ఆక్రమించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బాలీవుడ్ స్టార్స్ కూడా మన సినిమాల్లో నటించేందుకు వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే గెస్ట్ అప్పియరెన్స్ లో అయినా నటించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హైప్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకున్నాడు.

ఇంకా ఎలాంటి అప్ డేట్స్ రానప్పటికీ… రాజమౌళి, మహేష్ ల సినిమా గురించి రకరకాల వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చాడు. SSMB 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పారు. దీంతో ఈసారి జక్కన్న ఈ సినిమా ను గ్లోబ‌ల్ స్కేల్‌ లో ప్లాన్ చేస్తున్న‌ట్లు ఫ్యాన్స్‌ ఓ అంచనాకు వ‌చ్చారు. మహేష్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వార్తలు వెలువడలేదు. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నింటికీ సమాధానం చెబుతారని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Also Read : Ambani Marriage: అంబాని పెళ్లి లో డాన్స్ తో ఇరగాదీసిన తలైవా రజినీకాంత్!!

రాజమౌళి ప్రతి సినిమాతో తెలుగు సినిమా హద్దులు పెంచుతూనే ఉన్నాడు. మహేష్ సినిమాను కూడా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అందరు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడని అందరికి పూర్తి విశ్వాసం ఉంది. నాగ్ అశ్విన్ ఆల్రెడీ కల్కి సినిమా ద్వారా తెలుగు సినిమా స్థాయి ని మరింత పెంచాడు.ఇప్పుడు హాలీవుడ్‌లో మన జెండా ఎగురవేసే పూర్తి బాధ్యత రాజమౌళి తీసుకుంటారు. మహేష్ సినిమా విడుదలయ్యాక హాలీవుడ్ స్టార్స్ కూడా మన సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపడం ఖాయం అని చెప్పాలి. అయితే జక్కన్న తదుపరి సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.