Raj Tharun Lover Lavanya Tried To commit Suicide

Raj Tharun: టాలీవుడ్ ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ప్రేమకథ మరో మలుపు తిరిగింది. అయన మాజీ ప్రియురాలు లావణ్య శుక్రవారం నాడు ఆ హీరోపై నమ్మకద్రోహంతో కేసు పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజ్ లేకుండా నేను బతకలేను.. ఈ లోకాన్ని వదిలి వెళుతున్నాను అంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపింది. దీనిపై స్పందించిన న్యాయవాది వెంటనే 112కి కాల్ చేసి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు.

Raj Tharun Lover Lavanya Tried To commit Suicide

ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ లేకుండా నా జీవితం ఉండదు.. సర్వం కోల్పోయాను’’ అంటూ లావణ్య తన సూసైడ్ నోట్ లో పలు సంచలన విషయాలను ప్రస్తావించింది. నేను ఈ ప్రపంచంలో నా ప్రయాణాన్ని పూర్తి చేసాను. అందుకే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు నా గురించి తప్పుడు ఆలోచన ఉంటుంది. అదే సమయంలో, నేను ఎవరో తెలియని వ్యక్తులు నా వైపు ఉన్నారు. రాజ్‌తరుణ్ చేతిలో తీవ్రంగా మోసపోయాను. నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు. ”

Also Read : Bunny: ఆ సెంటిమెంట్ ఫాలో అయితే బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా..మరి పుష్ప- 2కి వర్కౌట్ అవుతుందా..?

“నేను మైండ్ గేమ్‌లు మరియు గాసిప్‌లతో విసిగిపోయాను. డ్రగ్స్ కేసులో నేను కీలక వ్యక్తిని అయ్యాను. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. నా భర్త కావాలి కాబట్టి నేను మాల్వీ ని ఎదురించాను. కానీ మాల్వీ నా మాట వినలేదు. నా చావుకి కారణం రాజ్‌తరుణ్ మరియు అతని తల్లిదండ్రులు. నా చావుకి కారణం మాల్వీ మల్హోత్రా. నేను రాజ్ తరుణ్‌తో కలిసి జీవించాలనుకుంటున్నాను. రాజ్ కూడా మల్వీ ప్రేమలో పడి చాలా మారిపోయాడు. లావణ్య లేఖలో తన బాధను వ్యక్తం చేస్తూ ఇలా రాసింది.మరి వీరి ప్రేమ కథ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.