Robinhood Movie hero Nithin Getup 

Robinhood: సినిమాలు అన్నాక ఎలాంటి వేషం అయినా వేయాలి. ఒక స్టార్ హీరోయిన్ వేసిన వేషధారణ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. పై ఫోటోలో వృద్ధుడి వేషధారణలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా? ఇతను టాలీవుడ్ హీరో. తన లేటెస్ట్ సినిమా కోసం ఇలా మారిపోయాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు షాక్ అయ్యారు. అసలీ గెటప్ ఏంటి… ఇది ఫేస్ యాప్ ద్వారా రూపొందించారా? లేక సినిమాలో ఇలా కనిపిస్తారా? అనే విషయాలు ఇప్పుడు అందరిని అయోమయానికి గురి చేస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. హీరో మారిన తీరు చూసి అభిమానులు ఆశ్చర్యపోవడం వారి వంతయ్యింది.

Robinhood Movie hero Nithin Getup 

చాలామంది మొదట్లో ఈ హీరోని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత తమ అభిమాన హీరో కి ఏమయ్యింది అని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’ తర్వాత శ్రీలీల మళ్లీ నితిన్‌తో జతకట్టనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Veena Srivani: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో మెరిసిన వేణుస్వామి సతిమణీ..

ఈ వీడియోలో, ప్రముఖ నటుడు నితిన్ వృద్ధుడి వేషధారణలో ఉన్నాడు. అతను వృద్ధుడిలా కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసిందనే చెప్పాలి. మరోవైపు శ్రీలీల కూడా వృద్ధురాలిలా కనిపించడం గమనార్హం. దర్శకుడు వెంకీ కుడుముల ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘25 ఏళ్లలో రాబిన్ హుడ్ ఇలాగే కనిపిస్తాడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ రూపాలను ఫేస్ యాప్ ద్వారా చేశారా? లేక సినిమాలో కూడా అలా ఉంటుందా? దీనిపై ఇంకా స్పష్టత లేదు. అది చూసిన అభిమానులు.. ‘‘బాబోయ్… నితిన్ ఇలా ఎలా అయ్యాడు ఏంటి? అంటూ పిచ్చి కామెంట్లు చేశారు.