Heroines interesting to do Lady Oriented Films 

Heroines:  సినిమా పరిశ్రమ పోకడ పూర్తి గా మారిపోయింది. ఒకప్పుడు హీరో ను చూసి సినిమా కి వచ్చే వారు ప్రేక్షకులు.. ఇప్పుడు దర్శకులను చూసి కూడా వస్తున్నారు. హీరోయిన్ లను చూసి కూడా వస్తున్నారు. మేం హీరో లకు ఏమాత్రం తీసిపోము.. హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ షో మాత్రమే కాదని అవసరమైతే ఈ సినిమాను భుజాలపై మోస్తాం.. సినిమా చేసి చూపిస్తాం అని అంటున్నారు ప్రముఖ నటీమణులు. సినిమాల్లో హీరోయిన్ ల ప్రభావం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. 

Heroines interesting to do Lady Oriented Films 

తరం మారినా హీరోయిన్ లు తమ సత్తా చాటుతూనే వస్తున్నారు.  శ్రీలీల, మృణాల్ ఠాకూర్‌ల రాకతో తమన్నా, అనుష్క, సమంత వంటి సీనియర్లు హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలుచేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటిగా అలాంటి సినిమాలు చేస్తు హీరో లకు సమానంగా కలెక్షన్స్ సాధిస్తున్నారు.. మిల్కీ బ్యూటీ ఇటీవలే ఒడెలా 2 చిత్రానికి సైన్ చేసింది.

Also Read: Robinhood: ఈ ఫోటో లో ఉన్న హీరో ని గుర్తు పట్టారా.. ఇలా అయిపోయాడేంటి?

భోళా శంకర్ తర్వాత తమన్నా ఏ తెలుగు సినిమాని అంగీకరించలేదు. అలాంటి తమన్నా ఓదెలా 2లో చేయడం విశేషం. సంపత్ నంది కథను అందిస్తుండగా తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సిటీమార్’ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు వీరి కాంబో లో “ఒదెలా 2” రావడం విశేషం. ఇది ఓదెల రైలు స్టేషన్‌ సినిమా కి సీక్వెల్.ఇకపోతే  రష్మిక మందన్న కూడా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టి పెడుతుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా.ఇకపోతే అనుష్క హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పూర్తిగా మానేసింది. నయనతార కూడా ఎక్కువగా హీరోయిన్ సెంట్రిక్ కథలకే ఓటేస్తుంది.

కాజల్ పెళ్లికి ముందు ఒక్క ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేయలేదు…కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అలాంటి సినిమాలే చేస్తోంది. రీసెంట్ గా “సత్యభామ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చందమామ. కీర్తి సురేష్ మరియు సాయి పల్లవి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్ లు అందరూ ఇలా ఈ సినిమా లు చేయడం వారికి కొత్తగా మార్కెట్ ను ఏర్పరుస్తుంది.