Game Changer: శంకర్ దర్శకత్వంలో వచ్చిన “భారతీయుడు-2” సినిమా కోసం కమల్ హాసన్ అభిమానుల కంటే రామ్ చరణ్ అభిమానులే ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే శంకర్ చరణ్ తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి. ఇండియన్-2 సినిమా ఎలా ఉంటుందో తెలిసిందే గేమ్ చేంజర్ పై ఓ అంచనా వేయొచ్చు. అలా ఎట్టకేలకు “ఇండియన్-2” విడుదలైంది. శంకర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా అని ప్రేక్షకులు చేతులెత్తేశారు. శంకర్ కెరీర్ లో ఫ్లాప్ లు కొత్తేమీ కాదు. బాయ్స్ సినిమా పరాజయం పాలైంది. 2.O కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ వాటిపై శంకర్ మార్క్ కనిపించింది.
Game Changer Movie Effected by shankar
దర్శకుడిగా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పలేం. కానీ “ఇండియన్-2” విషయంలో అలా కాదు. ఏళ్ల తరబడి శంకర్ సినిమాలను ఆస్వాదించిన వారికి ఇది ఆయన సినిమా అంటే నమ్మడం కష్టమే. ఈ సినిమాలో సేనాపతి అనే కల్ట్ క్యారెక్టర్‌ని అతను చూపించిన విధానం ప్రేక్షకులకు చాలా షాక్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన రామ్ చరణ్ అభిమానులు “గేమ్ ఛేంజర్” ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు. చరణ్ సినిమాలో కూడా శంకర్ అదే నిర్లక్ష్యం కనపరిస్తే ఎలా అనేది వారి ఆలోచన. దర్శకుడిగా శంకర్ ఏ సినిమాలోనూ ఫెయిల్ కాలేదు. కానీ “ఇండియన్ 2” చూసిన వారు అతను పూర్తిగా విఫలమయ్యాడని నిర్ధారించారు.
Also Read: Gautam Gambhir: గంభీర్ కొత్త డిమాండ్స్…టీమిండియా కోసం డేంజర్ ప్లేయర్ వస్తున్నాడు ?
ఈ సినిమా రిజల్ట్ గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ పై ఎన్నో సందేహాలను తీసుకొస్తుంది. అయితే గేమ్ చేంజర్ సినిమా కథను శంకర్ రాయలేదని గుర్తుంచుకోవాలి. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథ ఆధారంగా శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ట్రెండీ థింకర్‌గా కార్తీక్ తన సినిమాలలో ఎంతో ప్రత్యేకతను చూపిస్తాడని భావిస్తున్నారు. కథ విషయంలో శంకర్ కొంచెం తడబడవచ్చు కానీ, మంచి కథ ఇస్తే బాగా చేస్తాడని అంటున్నారు అభిమానులు. అందుకే, గేమ్ ఛేంజర్‌లో శంకర్ నుండి భిన్నమైన చిత్రాన్ని చూస్తారని చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు.