Nita Ambani: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ఇప్పటివరకు మన దేశంలో ఇలాంటి పెళ్లి అసలు చూసే ఉండరు.అంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ. అయితే ఇప్పటికే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరిపిన ఈ ఫ్యామిలీ పెళ్లికి కూడా భారీగా ప్లాన్ చేశారు. ఫైనల్ గా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
The secret behind the lamp held by Nita Ambani
ఈ పెళ్లికి క్రికెటర్లు మొదలు బాలీవుడ్, టాలీవుడ్,హాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకి సంబంధించిన స్టార్ హీరో హీరోయిన్లు హాజరై డ్యాన్సులతో అదరగొట్టేశారు. అయితే అలాంటి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్ళిలో ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంది. వాళ్లు వేసుకున్న డ్రెస్సులు మొదలు నెక్లెస్లు, వేలి ఉంగరాలు ఇలా ప్రతి ఒక్కటి వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటికే కోట్లకు కోట్ల డబ్బు పెట్టి ముకేశ్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లి ని చేస్తున్నారు. అయితే రాధిక మర్చంట్ అనంత్ అంబానీ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొంది. (Nita Ambani)
Also Read: Ananth Ambani: అనంత్ అంబానీ కుర్తా పై ఉన్న ఆ చిన్న వజ్రం ధర అన్ని కోట్లా..?
అదేంటంటే వీరి పెళ్లిలో నీతా అంబానీ ఒక దీపం పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె వెనకాలే ముఖేష్ అంబానీ,అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ వచ్చారు. అయితే ఆ దీపానికి వినాయకుడి ప్రతిమ కూడా ఉంది.దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అసలు నీతా అంబానీ అలా దీపం పట్టుకొని ఎందుకు నడుస్తుంది.ఆమె వెనకాలే ముకేశ్ అంబానీ,కొత్త దంపతులు ఎందుకు వస్తున్నారు అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం అయితే నెలకొంది. మరి నీతా అంబానీ అలా గణపతి ప్రతిమ ఉన్న దీపాన్ని పట్టుకొని రావడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది.
అదేంటంటే నీతా అంబానీ తన చేతిలో పట్టుకున్న గణపతి చిహ్నం ఉన్న దీపాన్ని రామన్ దివో అంటారట.అయితే ఈ దీపానికి గుజరాతి పెళ్లిళ్లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.గుజరాతీలు పెళ్లి చేసుకున్న సమయంలో కొత్తజంటను ఇలా దీపం వెలిగించుకొని ముందుకు నడిపించుకుంటూ వస్తూ ఉంటే ఆమె వెనకాలే కొత్త దంపతులు రావాలి.అయితే ఈ రామన్ దివో ని గుజరాతి పెళ్లిళ్లలో శుభప్రదంగా భావిస్తారు. అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్తజంట జీవితంలో చీకట్లు తొలగిపోయి అంతా శుభమే జరగాలి అని కోరుకుంటూ ఈ దీపాన్ని వెలిగించి తీసుకువస్తారట. ఒకరకంగా రామన్ దివో కొత్తజంటని ఆశీర్వదిస్తుందట.(Nita Ambani)