Kcr: తెలంగాణ రాష్ట్రంలో… గులాబీ పార్టీ… పరిస్థితి.. అత్యంత దారుణంగా తయారైంది. ఒక్కో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి రాజీనామా చేసి… కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఇప్పటికే 9 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫామ్ హౌస్ కు… కెసిఆర్ పిలిచి మాట్లాడిన కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఆగడం లేదు. వరుసగా రోజుకు ఒక ఎమ్మెల్యే చొప్పున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. Kcr
Big shock for KCR 9 MLAs jumped Will BRS merge in Congress
అయితే.. హైదరాబాద్ లో గెలిచిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా… రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారు. శుక్రవారం రోజున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను.. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక శనివారం రోజున శేర్లింగంపల్లి ఎమ్మెల్యే… అరికపూడి గాంధీని… చేర్చుకోవడం జరిగింది. Kcr
Also Read: Pani puri: పానీపూరి తింటున్నావా… అయితే జాగ్రత్త.. క్యాన్సర్ రావడం గ్యారెంటీ?
ఈ సందర్భంగా… మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని… దానం నాగేందర్ వెల్లడించారు. త్వరలోనే పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని కూడా తెలిపారు. గులాబీ పార్టీలో కేవలం నలుగురు మాత్రమే మిగులుతారని… మొత్తం గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. Kcr
గతంలో కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కూడా… గులాబీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ఖాయమని దానం నాగేందర్ హెచ్చరించారు. మరో 17 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరితే… విలీన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… ఎలాంటి స్కెచ్ వేస్తారో చూడాలి. Kcr