Rohini: ఇటీవల సినిమాలను ప్రమోట్ చేయడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు. తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఎలా పడితే అలా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో సినిమా ప్రమోషన్ చేయడం అంటే మాటలు కాదు. ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ రోహిణి ‘బర్త్‌డే బాయ్’ చిత్రం కోసం ఒక ఫన్నీ వీడియో చేసింది. అందులో ఆమె రేవ్ పార్టీకి హాజరైనప్పుడు పట్టుబడ్డ ఓ నటి గా పాత్ర పోషించింది.

Jabardasth Actor Rohini on Senior Journalist

ఇటీవలే టాలీవుడ్ నటి హేమ రేవ్ పార్టీకి హాజరై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హేమకు సంబంధించిన రేవ్ పార్టీ పెను వివాదానికి కారణమైంది. ఈ విషయం వారం పది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. అందుకే రోహిణి అదే నేపథ్యంలో తన సినిమాను ప్రమోట్ చేసింది. ఓ రేవ్ పార్టీలో దొరికిన నటి వీడియోలో రోషిని  చేసింది. ఈ వీడియో వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత అది సినిమా ప్రమోషన్‌లో భాగమని తెలుసుకుని నవ్వుకున్నారు. అయితే ఆమెపై ఓ విలేకరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read: Allu Arjun: ఆ హీరోయిన్ కోసం స్నేహ రెడ్డికి బ్రేకప్.. ?

నిప్పు లేకుండా పొగ రాదు. ఆమె కూడా రేవ్ పార్టీలకు వెళ్లేది అని రోహిణి ని అనరాని మాటలు అన్నాడు. దాంతో ఆ జర్నలిస్ట్ పై ఆమె ఫైర్ అవుతూ విలేఖరి పై మంది పడింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో… రిపోర్టర్ కి పిచ్చెక్కింది అంటూ హేళన చేసింది. సీనియర్ రిపోర్టర్‌ కాబట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నా వేరే ఎవరైనా అయితే కొట్టే దాన్నంటూ చెప్పింది. అయితే దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది అందరికీ నిజంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.