Heroine: లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శాన్వీ శ్రీవాస్తవ. యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ఈ సినిమా 2012లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ సాన్వీకి అనుకున్నంత ఆఫర్స్ రాలేదు. తెలుగులో ఆడపడడపా సినిమాలో నటించిన ఈ బ్యూటీకి కన్నడలో మంచి ఆఫర్లు రాగా అక్కడ యష్, దర్శన్, గణేష్, రక్షిత్ శెట్టి వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది.
Heroine Shanvi Srivastava painful moment
వారితో చేసిన చిత్రాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతే కాక ఆమె అనేక మరాఠీ సినిమాల్లో నటించింది. శాన్వీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఇతర భాషల చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి చెప్పింది. గత డిసెంబర్‌లో తన జీవితంలో అత్యంత కష్టతరమైన రోజులు అని చెప్పింది.
Also Read: Pani puri: పానీపూరి తింటున్నావా… అయితే జాగ్రత్త.. క్యాన్సర్ రావడం గ్యారెంటీ?
డిసెంబర్ 8న శాన్వీ శ్రీవాస్తవ పుట్టినరోజు. అయితే మరుసటి రోజు తన జీవితంలో అత్యంత కష్టతరమైన క్షణమని చెప్పింది. డిసెంబర్ 9న తనకు అకస్మాత్తుగా విపరీతమైన కడుపునొప్పి వచ్చిందని చెప్పింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారని, ఆమెను పరీక్షించిన వైద్యుడు వెంటనే ఎంఆర్‌ఐ, క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారని చెప్పారు. కేన్సర్ పరీక్షతో తన మనసు కలత చెందిందని.. కేన్సర్ అయితే..? నొప్పి, శస్త్ర చికిత్సల పరంపర, కీమోథెరపీ వల్ల కలిగే విపరీతమైన నొప్పి, జుట్టు రాలడం అన్నీ క్షణాల్లోనే తనకు గుర్తు వచ్చాయని చెప్పింది.
తర్వాత వచ్చిన పరీక్ష రిపోర్టులో క్యాన్సర్ కాదని డాక్టర్‌కి చెప్పింది. అండాశయాలపై సిస్ట్‌లు ఏర్పడి.. వీటిలో కొన్ని సిస్ట్‌లు పగిలి అండాశయాలు దెబ్బతినడం వల్లే నొప్పి వచ్చిందని చెప్పింది. అయితే అది క్యాన్సర్ కాదని, దీర్ఘకాలిక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ నుంచి పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్, సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కొన్ని రకాల మందులు కూడా దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. గత నాలుగు నెలలుగా తాను శ్యాస సంబంధిత వర్కవుట్‌లపై దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు.