Samantha: ఏంటి నాగచైతన్యకు ఇష్టం లేకుండానే సమంత ను పెళ్లి చేసుకున్నాడా.. ఇందులో ఎవరి బలవంతం ఉంది.సమంత బలవంతం చేసిందా లేక మరెవరైనా ఆయనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారా..అంత గాఢంగా ప్రేమించిన నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం ఏంటి అని ఈ వార్త చూసిన చాలామంది జనాలు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ నాగచైతన్య ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారా..అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Naga Chaitanya married Samantha against her will.. because
సమంత నాగచైతన్య చాలా గాఢంగా ప్రేమించుకొని పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.అయితే అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కనీసం పట్టుమని పది సంవత్సరాలైనా కలిసి జీవితం పంచుకోలేదు. వీరి పెళ్లి మూడునాళ్ల ముచ్చటగా మారి నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు.అయితే ఇప్పుడు ఈ వార్త చూస్తే చాలామంది నాగచైతన్య బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టే సమంత చైతు మధ్య అండర్స్టాండింగ్ కుదరక విడిపోయారు అనుకుంటారు. (Samantha)
Also Read: Rashmika: అంబానీ పెళ్లిలో ఖరీదైన లెహంగా వేసుకున్న రష్మిక.. ధర ఎంతంటే.?
అయితే నాగచైతన్య సమంత ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అయితే అసలు నిజం ఏంటంటే.. సమంత నాగచైతన్య ప్రేమాయణం ఇండస్ట్రీలో బయటపడ్డాక ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం లేకపోతే మనపై వచ్చే రూమర్స్ ని ఆపలేం త్వరగా మీ ఇంట్లో చెప్పు అని సమంత బలవంత పెట్టిందట.అయినప్పటికీ చైతన్య మాత్రం సినిమాలు, కెరియర్ అంటూ చెప్పి పెళ్లి వద్దన్నారట.
ఇక ఆ సమయంలో సమంత నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా లేకపోతే నెక్స్ట్ రాఖీ పౌర్ణమి కి రాఖీ కట్టేయాలా అంటూ బెదిరించిందట. దాంతో భయపడిపోయిన నాగచైతన్య వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని నాగచైతన్యనే ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో సినిమాల మీద ఫోకస్ పెట్టిన నాగచైతన్యకు అప్పుడే పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం లేకపోయినా సమంతనే బలవంతం చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)