Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి వారి భార్యల కోపానికి బలైందా.. సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఎవరితో అయినా రొమాన్స్ చేయాల్సిందే..అలాంటిది హీరోలతో రొమాన్స్ చేసి ఎందుకు తమన్నా ఇబ్బందులు పాలైంది అనేది ఇప్పుడు చూద్దాం.తమన్నా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన జతకట్టింది.కానీ ఆ ముగ్గురు హీరోలతో జతకట్టిన సమయంలో వారితో రొమాన్స్ చేసి ఎన్నో ఇబ్బందులు పడిందట.మరి ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఎందుకు ఇబ్బందులు పడింది అనేది ఇప్పుడు చూద్దాం.తమన్నా మిల్కీ బ్యూటీ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎంతో మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
Tamannaah fell victim to the anger of their wives after romancing with the heroes
ఇప్పటివరకు ఎవరితో నటించినా కూడా ఇబ్బంది పడలేదట.కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ లతో నటించి ఇబ్బందుల పాలైందట.అసలు విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ తమన్నా కాంబినేషన్లో రచ్చ మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ సమయానికే రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి ఫిక్స్ అయింది. అలా పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఉపాసన,రామ్ చరణ్ రచ్చ మూవీ షూటింగ్ కి అప్పుడప్పుడు వచ్చేది. ఇక ఆ టైంలో రామ్ చరణ్ తో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఉపాసనని చూసి తమన్నా కాస్త భయపడిపోయేదట.అయితే ఉపాసన కాస్త మెచ్యూరిటీ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని అంతగా పట్టించుకోలేదట.(Tamannaah)
Also Read: Naga Chaithanya: హాట్ ఫొటోస్ షేర్ చేసిన శోభిత.. నాగచైతన్య ఏం చేశారంటే..?
ఇక మరో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ హీరోతో తమన్నా ఊసరవెల్లి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా లక్ష్మీ ప్రాణతిని చూసి భయపడి పోయిందట. ఎందుకంటే ఊసరవెల్లి సినిమా కంటే ముందే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ల వివాహం జరిగింది.అలా కొత్తజంట కావడంతో ఎన్టీఆర్ లక్ష్మీని తన మూవీ షూటింగ్ కి తీసుకువచ్చే వారట. ఇక ఆ టైంలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే సన్నివేశాలు వచ్చినప్పుడు లక్ష్మీ ప్రణతి తమన్నాని చూసే చూపుకి ఆమె ఎంతో హడలిపోయదట. అంతేకాదు షూటింగ్ సమయంలో కనీసం ఎన్టీఆర్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చోవడానికి కూడా భయపడేదట. అలా లక్ష్మీ ప్రణతి చూపులు తమన్నాని అంతలా భయపెట్టాయట. ఇక ఇంకో హీరో అల్లు అర్జున్.. అల్లు అర్జున్ తమన్నా కాంబోలో బద్రీనాథ్ మూవీ వచ్చింది.
ఇక ఈ మూవీ షూటింగ్ కంటే ముందే స్నేహ రెడ్డి అల్లు అర్జున్ లు ప్రేమించుకున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ కి అప్పుడప్పుడు స్నేహ రెడ్డి వస్తూ పోతూ ఉండేదట.అయితే బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ తమన్నా మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఆ టైంలో స్నేహ రెడ్డిని చూస్తూ తమన్నా ఆ సన్నివేశాలు సరిగ్గా చేయకపోయేదట. ఇక ఆ టైంలో వీళ్ళ పెళ్లి కాకపోవడంతో అల్లు అర్జున్ తో తమన్నా మాట్లాడితే స్నేహారెడ్డి చాలా కోపంగా చూసేదట. దాంతో అల్లు అర్జున్ తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు కూడా ఎక్కువ టేక్స్ తీసుకునేదట.అంతేకాదు స్నేహ రెడ్డి వస్తే అల్లు అర్జున్ తో కనీసం తమన్నా మాట కూడా మాట్లాడేది కాదట. అలా ఆ హీరోల భార్యల వల్ల తమన్నా ఆ సినిమా షూటింగ్స్ లో చాలా ఇబ్బంది పడిందని అప్పట్లో కూడా టాక్ వినిపించింది.(Tamannaah)