Aishwarya Rai: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ల విడాకులు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హాట్ టాపిక్. అప్పుడప్పుడు వీరిద్దరికి సంబంధించిన వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా అంబానీ ఇంటికి పెళ్లి కోసం ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు గెస్ట్లుగా వెళ్లారు. ఇందులో భాగంగా అభిషేక్ బచ్చన్ కూడా తన ఫ్యామిలీతో వెళ్లారు. అయితే ఇక్కడ ఉన్న అసలు విషయం ఏంటయ్యా అంటే..అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీలో తన భార్య ఐశ్వర్యరాయ్ మిస్ అయింది.
Aishwarya Rai is getting close to Salman
అభిషేక్ బచ్చన్,అమితాబచ్చన్, జయా బచ్చన్ వీళ్ళందరూ కలిసి వెళ్తే ఐశ్వర్యరాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్య రాయ్ బచ్చన్ తో సింగిల్ గా వెళ్ళింది. దాంతో అంబానీ పెళ్లి కంటే ఎక్కువగా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ లు విడివిడిగా రావడమే మీడియాలో హైలెట్ గా మారింది.దీంతో ఈ విషయం తెలిసిన బాలీవుడ్ జనాలు సైలెంట్ గా ఉంటారా వీరి మధ్య విడాకులు నిజమేనని ఈ వార్తను తెగ హైలైట్ చేస్తున్నారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు వారి భార్యలతోనే కలిసి వచ్చారు. (Aishwarya Rai )
Also Read: Raj Tarun: లావణ్య లాగే రాజ్ తరుణ్ కూడా సూసై**..?
కానీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మాత్రం విడివిడిగా రావడం మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఒక్కసారిగా ఐశ్వర్య,అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు బీ టౌన్ లో వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు ఈ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే..ఐశ్వర్య రాయ్ తన మాజీ ప్రియుడు అయినటువంటి సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగింది. దానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట జోరుగా చక్కర్లు కొట్టడంతో భర్తను వదిలేసి మాజీ ప్రియుడితో ఐశ్వర్య రాయ్ ఫోటో దిగింది అంటే ఇందులో ఏదో మతలబ్ ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాదు సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ లు చాలా గాఢంగా ప్రేమించుకొని పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు సల్మాన్ పెట్టే టార్చర్ భరించలేక ఐశ్వర్య అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ ఎక్కువగా ఎక్కడా కలవలేదు. అలాంటిది అభిషేక్ బచ్చన్ తో విడాకుల వార్తలు వైరల్ అవుతున్న వేళ సల్మాన్ ఖాన్ తో ఐశ్వర్య రాయ్ ఫోటో దిగడం సంచలనంగా మారింది. మరి ఐశ్వర్యారాయ్ నిజంగానే సల్మాన్ తో ఫోటో దిగిందా..లేకపోతే ఎవరైనా ఎడిటింగ్ చేసి పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.(Aishwarya Rai )