Bigg Boss 9: దేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పై విమర్శలు చేస్తుంటారు కొంతమంది నెటిజెన్లు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు ప్రజలను చెడగొట్టే షో అని విమర్శిస్తుంటారు. మరికొందరు బిగ్ బాస్ పై కేసులు కూడా పెట్టారు.అలా బిగ్ బాస్ కి ఎంతో వ్యతిరేకత ఉంది. బిగ్ బాస్ షో పలు భాషల్లో వస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో అయితే ఇది ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుని తొమ్మిదో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సారి పెద్ద పెద్ద సెలెబ్రిటీలను ఈ షో కోసం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు హిందీలో కూడా ఈ షో విజయవంతంగా నిర్వహించబడుతుంది.

Netizens Fire on Bollywood OTT Bigg Boss 9

సల్మాన్ ఖాన్ హిందీ షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. టీవీ షోతో పాటు, బిగ్ బాస్ OTT సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ OTT సీజన్‌కు అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే  బిగ్ బాస్ అంటే మనకు గుర్తొచ్చేది ఫైటింగ్, ఏడుపులు, అరుపులు, సానుభూతి ఆపై టాస్క్‌లు, ఎలిమినేషన్‌లు, ఓటింగ్ మొదలైనవి. ఈరోజుల్లో బిగ్ బాస్ షో లో గ్లామర్ కాస్త ఎక్కువైంది. హాట్ హాట్ అందాలను ఇంట్లోకి పంపి టీఆర్పీలు పెంచుకుంటున్నారు. దీన్ని ఎక్కువగా హిందీలో చూస్తుంటాం. షోకి గ్లామర్‌ను జోడించేందుకు అందాల బొమ్మలను ఇంట్లోకి తీసుకోస్తుంటారు.

Also Read: Turmeric: పసుపు అతిగా తింటే ప్రమాదమే.. తస్మాత్ జాగ్రత్త?

అలా ఒక హాట్ జంట బిగ్ బాస్ లోకి వస్తుంది. తన ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. చాలా మంది దీనిని విమర్శించారు, అర్మాన్ మాలిక్ భార్యల పేరు పాయల్ మాలిక్ మరియు కృతికా మాలిక్. అయితే వీరిలో పాయల్ మాలిక్ ఎలిమినేట్ చేయబడింది. వీరి వల్ల బిగ్ బాస్ నిర్వాహకులపై నెటిజన్లు మరోసారి విరుచుకుపడ్డారు.

బిగ్ బాస్ హౌస్‌లో రొమాన్స్ ఎక్కువైంది. అర్మాన్ మాలిక్ తన భార్యతో చేసిన బెడ్ రొమాన్స్ చాలా సంచలనం కలిగించింది. తన భార్యతో రొమాంటిక్ సన్నివేశాలు కెమెరాకు చిక్కాయి. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షో ఇంత దారుణంగా మారిందని విమర్శించారు. మరి టీఆర్పీ ల కోసం వీరు ఇంత దిగజారడం ఏంటి అని సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.