Allu arjun pushpa 2 movie release delay

Allu Arjun: అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం అందరిని ఎంతో నిరాశపరిచింది. ఇక ఈ సినిమా కి సంబంధించి ఏ అప్డేట్ ను కూడా దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కనీసం పాటలు కూడా విడుదల చెయ్యట్లేదు. ఇదిలా ఉంటే పుష్ప తొలి భాగం లో సూపర్ హిట్ అయిన ఐటెం సాంగ్ ను రెండో పార్ట్ లో కూడా పెట్టబోతున్నారట. అయితే ఈ పాటను ఇప్పటివరకు చిత్రీకరించాలేదట.  అందుకు కారణం అల్లు అర్జున్‌కి సరైన డ్యాన్స్ పార్ట్‌నర్ దొరకకపోవడమే అంటున్నారు.

Allu arjun pushpa 2 movie release delay

పుష్ప 1 లో సమంత వేసిన స్టెప్ లను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. అయితే అదే స్థాయిలో రెండో పార్ట్ లో బజ్ తీసుకురావడం  ఇప్పుడు సవాల్‌గా మారిందని ఇన్‌సైడ్ స్కూప్. ఈ ఐటెం సాంగ్ కోసం మొదట జాన్వీ కపూర్‌ని అడిగారు. కానీ ఆమె జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలతో టాలీవుడ్‌లో సినిమాలు చేస్తుండడంతో ఆమె కూడా అలాంటి ప్రత్యేక పాట చేయడానికి ఇంటరెస్ట్ గా లేదట.అందులోనూ ఆమె ఒప్పుకుంటే భారీగానే పైకం చెల్లించాల్సిందే.దాంతో ఆమె తో చేయడం కొంచెం కష్టం గా మారింది. 

Also Read: Sonu Sood: అనుష్క పాలిట దేవుడైన సోనూ సూద్.. ఇంతకీ ఏమయ్యిందంటే?

వారికి ఉన్న ఈ తక్కువ టైం లో టాప్ హీరోయిన్ ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం పెద్ద కష్తమే అని చెప్పాలి. అల్లు అర్జున్ కూడా దీనిపై గుర్రు గా ఉన్నారట. ఈ విషయమై భారీ జాప్యం జరగడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారని సన్నిహితులు వెల్లడించారు. ఇటు ఫాహద్ డేట్స్ కూడా లేవట. లేట్ అవడంతో డేట్స్ అయిపోయాయి. ఇప్పుడు వేరే సినిమాలు చేస్తుండడంతో అయన డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. మరి డిసెంబర్ దగ్గరికి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ను ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.