Ram Charan Movie Game Changer News

Ram Charan:  రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు చాలా టెన్షన్ లో ఉంది ఉంటారు. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఫలితం చాలా తేడాగా వచ్చింది.  విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ, “భారతీయుడు 2” ఫలితాలు చూసిన చరణ్ అభిమానులు తమ హీరో సినిమా ‘గేమ్ చేంజర్’ గురించి ఎన్నో సందేహాలు వారిలో మదిలో ఉంటాయి. కమల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని దర్శకుడు శంకర్ బద్దలు కొట్టడంతో అయన చేస్తున్న తదుపరి సినిమా ఎలా ఉంటుందో తెలియక చరణ్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయ్యింది. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియదు. భారతీయుడు 3 ఉండనే ఉంది.. ఇవన్ని చెర్రీ అభిమానులను కలవరపెడుతు ఉంటుంది.

Ram Charan Movie Game Changer News

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అందులోనూ రామ్ చరణ్ ద్యుయల్ రోల్ లో చేస్తున్న సినిమా కాబట్టి నాయక్‌ కంటే డబుల్‌ ట్రీట్‌ ఇస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాకపోతే సినిమా చాలా ఆలస్యమైంది. ఈ సినిమా తో చాలా టైం వేస్ట్ అయ్యిందని వారు భావిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఈ సినిమా ఒప్పుకుని చరణ్ చాలా పెద్ద తప్పు చేశాడని కూడా అంటున్నారు. ఏదేమైనా గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు.

Also Read: Tarun Arora: అందాల భామ అంజలా ఝవేరి భర్త ఎవరో తెలుసా..అందరికి తెలిసిన నటుడే!!

భారతీయుడు 2 ఫలితం తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని తీసుకురాకపోవచ్చు. కానీ తమిళనాడు మరియు కేరళ లో ఫ్లాప్ ప్రభావం భారీ గా చూపుతుందని కొనుగోలుదారులు భావిస్తున్నారు. శంకర్ బ్రాండ్ ‘ఐ’ సినిమా నుంచి పడిపోవడం 2.0 సినిమా కి  వసూలు పెద్దగా రాకపోవడం భారతీయుడు 2 భారీ నష్టాన్ని చవిచూస్తుందన్న వార్తలు రావడం వంటివి చూస్తుంటే పాన్-ఇండియా స్థాయి లో రాబోతున్న  గేమ్ ఛేంజర్‌ హిట్ గా మారాలంటే  చరణ్ బాగానే కష్టపడాలి. థమన్ సంగీతం అందిస్తున్నగేమ్ ఛేంజర్‌ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.