Balakrishna who never acted with that heroine because of his father

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయన జనరేషన్ హీరోయిన్ల నుండి ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్క హీరోయిన్ తో ఈయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇక ఈ జనరేషన్ లో మాత్రం కాజల్, శ్రీలీల,ప్రగ్యా జైస్వాల్, అంజలి,సోనమ్ చౌహన్ ఇలా ఎంతో మంది హీరోయిన్లతో బాలకృష్ణ తెర పంచుకున్నారు.

Balakrishna who never acted with that heroine because of his father

అయితే అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తో సినిమా చేయాలి అని బాలకృష్ణకు ఎంతగానో ఆశ ఉండేదట. కానీ ఆయన ఆశలను అడియాసలు చేశారు బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్టీఆర్.. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.అవును మీరు వినేది నిజమే. శ్రీదేవితో బాలకృష్ణకి రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట.(Balakrishna)

Also Read: Raj Tarun: లావణ్య లాగే రాజ్ తరుణ్ కూడా సూసై**..?

కానీ సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవద్దని బాలకృష్ణ కి చెప్పారట.. ఎందుకంటే బాలకృష్ణతో శ్రీదేవిని హీరోగా పెట్టి ఓ డైరెక్టర్ సినిమా చేయాలి అనుకున్నారట.అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ని పిలిపించుకొని నీకు శ్రీదేవి తల్లి లాంటిది. ఆమెతో నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను.

Balakrishna who never acted with that heroine because of his father

అలాంటి తల్లి లాంటి ఆమెతో నువ్వు సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి నుండి నువ్వు నీ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవిని తీసుకోకు అంటూ చెప్పారట. ఇక తండ్రి చెప్పిన ఆ ఒక్క మాటకి కట్టుబడి బాలకృష్ణ తన సినిమాలో ఎన్ని సార్లు శ్రీదేవిని హీరోయిన్గా తీసుకోవాలి అని దర్శక నిర్మాతలు భావించినప్పటికీ ఆయన మాత్రం రిజెక్ట్ చేసేవారట.(Balakrishna)