Jahnvi Kapoor got 3rd telugu movie chance 

Jahnvi Kapoor: బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న లెజెండరీ బ్యూటీ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ తెలుగు లో నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇటు బాలీవుడ్ యంగ్ హీరో ల సరసన నటిస్తుంది. అయితే సల్మాన్, షారూఖ్ లాంటి సీనియర్ల ముందు చిన్నఅమ్మాయిలా కనిపించడం వంటి కారణాలు ఆమెకు అక్కడ పెద్దగా అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాయి. అందుకే ఆమె తన ఫోకస్ ఇప్పుడు తెలుగు లో పెట్టింది. RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో ఆమె సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.

Jahnvi Kapoor got 3rd telugu movie chance 

అయితే ఇప్పుడు ఆమె తన మూడవ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.ఓ యంగ్ హీరో చేయబోయే సినిమా కోసం ఈమెను సంప్రదిస్తున్నారట.వారు చేయబోయే పాన్-ఇండియా చిత్రానికి జానీ కపూర్ సరిగ్గా సరిపోతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ధృవీకరణ మాత్రం కాలేదు కానీ ఆమె ఈ సినిమా లో ఉంటే బాగుంటుందనేది అందరూ అనుకునే మాట. జాన్వీ ప్రస్తుతం దేవర 1 చేస్తుంది. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వం లో రాబోయే రామ్ చరణ్ 16వ సినిమా కూడా చేస్తుంది. సెప్టెంబరులో ఈ షెడ్యూల్ ఖరారు కానుంది.

Also Read: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు.. రకుల్ కి కూడా సంబంధం ఉందా.?

ఈ రెండు సినిమా లు హిట్ అయితే మాత్రం జాన్వీ కపూర్‌ తెలుగులో ఆకట్టుకునే అవకాశం ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ లీడింగ్ హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఉంది. సీనియర్స్‌కి జోడీ వెతకడం దర్శకులకు కూడా సవాలే.. ఇప్పుడున్న క్రేజీ స్టార్‌లకు కూడా ఇది సవాల్‌. జాన్వీ లాంటి వారు ఇక్కడి కెరీర్‌పై సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌లో సెటిల్ అవ్వొచ్చు. ఒకప్పుడు శ్రీదేవికి తిరుగులేని స్టార్ డమ్ ఇచ్చిన ఇండస్ట్రీ టాలీవుడ్. మరి ఆమె కూడా అలాగే ఆలోచించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి.ఆమె తెలుగులో చేస్తున్న తొలి చిత్రం “దేవర”. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.