Prabhas guest roles in tollywood movies

Prabhas: బాహుబలి సినిమా తో ప్రభాస్ క్రేజ్ భారీ గా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కల్కితో దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. విదేశాల్లో సైతం ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గా పెరిగింది. ప్రభాస్ నటించిన రెండు టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేయి కోట్ల రూపాయలను వసూలు చేశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి చిత్రం మంచి విజయం సాధించి రీసెంట్ గా రూ.1000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఇంకా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన, రాజేంద్రప్రసాద్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళితో పాటు పలువురు హాజరయ్యారు. ఇక కల్కి పార్ట్ 2 షూటింగ్ 60% పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు.

Prabhas guest roles in tollywood movies

ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కల్కి 2 తో పాటు, అతను సలార్ 2,  రాజా సాబ్ మరియు స్పిరిట్‌లను కూడా లైన్‌లో పెట్టాడు. ఇవే కాకుండా మంచు హీరో విష్ణు హీరోగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కన్నప చిత్రంలో ప్రభాస్ అతిధి పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో కేవలం ప్రభాస్ కళ్లు మాత్రమే కనిపించాయి. అలా ఇప్పుడు ప్రభాస్ మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Tollywood: ఆగస్ట్ లో అదృష్టం పరీక్షించుకోనున్న ఫ్లాప్ హీరో లు.. హిట్ అందుకునేనా!!

ఈసారి తన స్నేహితుడు గోపీచంద్ సినిమా కోసం అయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గోపీచంద్, శ్రీను వైట్లకు చాలా కీలకం. అందుకే ఈ చిత్రంలో ప్రభాస్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. విశ్వం సినిమాలో ప్రభాస్ అతిధి పాత్రలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డబ్బింగ్ మాత్రమే చెబుతున్నారట. గోపీచంద్ ఎంట్రీ కోసం ప్రభాస్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ఓ స్పష్టత రానుంది.