Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… మొన్న జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఎవరు ఊహించని విధంగా.. వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. 175 స్థానాలకు 175 స్థానాలు కొడతామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిత్యం చెప్పారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. Jagan
Backlash to Jagan YCP MPs into TDP
కేవలం వైసీపీ పార్టీకి 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. 4 ఎంపీలు గెలుచుకుంది వైసిపి పార్టీ. దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే ఇప్పుడు… రాజ్యసభలో 11 ఎంపీలను కలిగి ఉంది వైసిపి పార్టీ. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి రాజ్యసభ బలం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో.. ప్రతి దానికి వైసిపి సపోర్ట్ తీసుకోవాల్సి వస్తోంది. Jagan
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం…మంత్రి పదవికి రాజీనామా ?
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు… వైసీపీ రాజ్యసభ సభ్యులపై కన్నువేశారట. తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే విషయాన్ని చర్చించబోతున్నారట. ఆర్ కృష్ణయ్య, మేడ మల్లికార్జునరావు, మస్తాన్ రావు అలాగే బాబురావు ఈ నలుగురు.. చంద్రబాబు టచ్ లోకి వెళ్లారట. బాబు ఢిల్లీ పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట. Jagan
ఈ నలుగురు ఎంపీలు టిడిపి పార్టీలో చేరితే బిజెపికి కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అటు తెలుగుదేశం ఏపీలో అధికారంలో ఉన్న తరుణంలో… ఈ నలుగురు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుతో కూడా చర్చలు చేశారట. వీరితో పాటు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. Jagan