Malvi Malhotra: తిరబడరా సామి సినిమాతో తెలుగులో ఎలాగైనా స్టార్డం సంపాదించాలనుకున్న మాల్వి మల్హోత్రా అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంది.నన్ను నా ప్రియుడిని దూరం చేస్తుంది అంటూ మాల్వి మల్హోత్రా పై హీరో రాజ్ తరుణ్ లవర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ఒక్కసారిగా మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో మాల్వి మల్హోత్రాకి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ మధ్యనే లావణ్య మాల్వీ మల్హోత్రాపై కేసు పెట్టింది.
Producer’s mother’s case against Malvi Malhotra
మాల్వి నుండి తనకు ప్రాణ భయం ఉంది అని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయితే తాజాగా మాల్వి మల్హోత్రాపై మరో కేసు నమోదయ్యింది. అదేంటంటే..ఓ నిర్మాత తల్లి తన కొడుకుని మోసం చేసి డబ్బులు అన్ని కాజేసింది అంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.ఇక ఆ నిర్మాత ఎవరు ఎందుకు నిర్మాత డబ్బులు మాల్వి తీసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా లావణ్య.. మాల్వి మల్హోత్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్ పై కేసు పెట్టి ఆయన డబ్బులన్ని కొట్టేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.( Malvi Malhotra)
Also Read: Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. అందుకే లండన్ ప్రయాణమా..?
అయితే ఆ వ్యాఖ్యలు నిజమే అనేలా ఆ నిర్మాత తల్లి తాజాగా పోలీస్ స్టేషన్ లో మాల్వి మల్హోత్రాపై కేసు పెట్టింది.నా కొడుకు యోగేష్ ని ప్రేమ పేరుతో వాడుకొని వాడి ఆస్తులన్నీ కాజేసింది అంటూ ఇద్దరు మాట్లాడుకున్న వీడియో కాల్స్,ఆడియో కాల్స్ అన్ని బయట పెట్టేసింది. అయితే గతంలో నిర్మాత యోగేష్ తో మాల్వి మల్హోత్రా రిలేషన్ పెట్టుకుంది.
వీరిద్దరి రిలేషన్ చాలా సంవత్సరాలు కొనసాగాక ఏమైందో ఏమో తెలియదు కానీ మాల్విపై యోగేష్ కత్తితో దాడి చేశాడని పోలీస్ కేసు పెట్టింది. దాంతో యోగేష్ జైలు పాలయ్యాడు. కానీ మాల్వినే కత్తితో చేతులు కట్ చేసుకుని తన మాజీ ప్రియుడి పై అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టింది అంటూ లావణ్య ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా యోగేష్ తల్లి మాల్వి పై కేసు పెట్టింది.( Malvi Malhotra)