Tamannaah: అంబానీ పెళ్లికి చాలామంది సెలబ్రిటీలు వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మరి ముఖ్యంగా ధనవంతులు పెళ్లి కాబట్టి వాళ్లు కూడా రిచ్ లుక్ లోనే కనిపించాలని ఒకరికి మించి ఒకరు ఖరీదైన బట్టలు, నగలు వేసుకొని పెళ్లికి హాజరయ్యారు.ఈ పెళ్లిలో సౌత్ నుండి మహేష్ బాబు,రామ్ చరణ్, వెంకటేష్, రజినీకాంత్ వంటి హీరోలతో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.ఇక బాలీవుడ్ లో అయితే ప్రతి ఒక్కరు ఆ పెళ్లిలో సందడి చేశారు.
Tamannaah lehanga cost
అయితే అలాంటి ఈ పెళ్లిలో తమన్నా భాటియా కూడా పాల్గొంది.అయితే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో తమన్నా భాటియా బ్లాక్ కలర్ లెహంగా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. తెల్లటి పాలమీగడలా ఉండే తమన్నా భాటియా నల్లటి లెహంగాలో చాలా అందంగా మెరిసిపోయింది. ఆ బ్లాక్ కలర్ లెహంగా మీద గోల్డ్ వర్క్ లెహంగా కి మరింత అందాన్ని ఇచ్చింది. (Tamannaah )
Also Read: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు.. రకుల్ కి కూడా సంబంధం ఉందా.?
ఇక ఈ బ్లాక్ కలర్ లెహంగాని కరణ్ థోరాని డిజైన్ చేశారట.. అయితే ఈ లెహంగా డిజైన్ కి తగ్గట్టే ధర కూడా ఉంది. ఇక దాని ధర ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.ఎందుకంటే తమన్నా భాటియా వేసుకున్న లేహంగా చోలీ ధర అక్షరాల 4 లక్షల రూపాయలట.. అవును మీరు వినేది నిజమే.. అంత గ్రాండ్ గా ఉన్న లెహంగాకి ఆ మాత్రం డబ్బులు పెట్టడం కూడా కరెక్టే అంటున్నారు చాలామంది తమన్నా వేసుకున్న లెహంగా ధర తెలిసి.
ఇక వీరి పెళ్లిలో ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే తమన్నా అనంత్ అంబాని పెళ్లికి తన బాయ్ ఫ్రెండ్ తో రాకుండా విడిగా వచ్చింది.అలాగే విజయ్ వర్మ కూడా విడిగానే వచ్చారు. ఇక ఈ పెళ్లిలో తమన్నా విజయ్ వర్మతో కనిపించకుండా ఓ మిస్టరీ మ్యాన్ తో కనిపించేసరికి వీరి మధ్య ఏదైనా గొడవలు వచ్చాయా అని టాలీవుడ్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి.(Tamannaah )