BRS: తెలంగాణ రాష్ట్రంలో… గులాబీ పార్టీ.. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత… మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది గులాబీ పార్టీ. రెండుసార్లు అధికారంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు… గులాబీ పార్టీ టిఆర్ఎస్ గానే ఉండేది. టిఆర్ఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్లి రెండు సార్లు విజయం సాధించింది అనమాట. BRS
BRS Harish Rao’s back to KCR
అయితే… మొన్న 2024 ఎన్నికలకు మాత్రం.. భారత రాష్ట్ర సమితి పేరుతో ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు ఇదే పెద్ద మైనస్ గా మారింది. ఫలితంగా అధికారం కోల్పోవడం… అటు ఎంపీ ఎన్నికల్లో 0 స్థానాలకే పరిమితం కావడం జరిగింది. కల్వకుంట్ల కవిత కూడా… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని… జైలు పాలయ్యారు.BRS
Also Read: Jagan: జగన్ కు ఎదురుదెబ్బ… TDPలోకి వైసీపీ ఎంపీలు ?
గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ… జారుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కిందిస్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు అందరు ఇదే అంటున్నారు. BRS
కానీ కెసిఆర్ మాత్రం దానిపైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే.. కెసిఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు హరీష్ రావు. పటాన్ చెరువు నియోజకవర్గం లో పర్యటించిన హరీష్ రావు… అందరూ భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకుంటే ఆయన మాత్రం.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కండువా కప్పుకొని కనిపించారు. దీంతో త్వరలోనే టీఆర్ఎస్ గా పేరు మార్చబోతున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హరీష్ రావు ఇలా వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ టాపిక్… వైరల్ గా మారింది. BRS