Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని ఆ హీరోయిన్ అంతలా అవమానించిందా.. అంత పెద్ద హీరోని అవమానించేత పని ఆయన ఏం చేశారు..అనేది ఇప్పుడు చూద్దాం.హీరో హీరోయిన్లు అవార్డ్స్ వస్తే దర్శకులను లేదా వేరే హీరోలను నిర్మాతలను పిలిచి వారితో అవార్డ్స్ అందజేస్తారు. అయితే ఓ సమయంలో అల్లు అర్జున్ తో ఓ హీరోయిన్ కి అవార్డు ఇప్పించారు. కానీ ఆ హీరోయిన్ మాత్రం అల్లు అర్జున్ తో తీసుకోకుండా తన భర్తని స్టేజి మీదకి రమ్మని తన భర్త చేతుల మీదుగా తీసుకుంటాను అని అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించింది.
The heroine who insulted Allu Arjun
ఇక ఆ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమెనేనండి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. 2016 సైమా అవార్డ్స్ లో నానుమ్ రౌడీధాన్ అనే మూవీకి గాను ఉత్తమ నటిగా నయనతారకి అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డుని ఇవ్వవలసిందిగా అల్లు అర్జున్ ని కోరారు.ఇక అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చిన నయనతార మైక్ అందుకొని ఈ అవార్డుని నా భర్త చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అని కోరడంతో విఘ్నేష్ శివన్ ని స్టేజి మీదకి పిలిచారు.(Allu Arjun)
Also Read: Rambha: రంభ క్యారెక్టర్ అలాంటిదా.. 6 నెలలు తండ్రిని చిత్రహింసలు పెట్టిందా..?
దాంతో అల్లు అర్జున్ నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న అవార్డుని విజ్ఞేష్ శివన్ చేతిలో పెట్టారు.ఇక అవమానం జరిగింది అన్నట్లుగా చూసి అల్లు అర్జున్ అక్కడనుండి వెళ్ళిపోకుండా వారిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, ప్రేమ చూసి అక్కడే ఉండి చప్పట్లు కొట్టి మరీ వారితో ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అయితే ఈ వీడియో చాలా సంవత్సరాలది అయినప్పటికీ ఇప్పటికీ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన అల్లు అభిమానులు నయనతారకు మరీ అంత పొగరు ఉండకూడదు .
ఇచ్చిన వారితో తీసుకోకుండా భర్త చేతుల మీద తీసుకుంటాను నాన్నా చేతుల మీద తీసుకుంటాను అని ఓవరాక్షన్ ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ని నయనతార మరీ అంత చీప్ గా చూడడం అవసరం లేదు. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు అందుకొని నేషనల్ అవార్డు ఆయన అందుకున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Allu Arjun)