Akshara Haasan: కమలహాసన్.. సినిమాల్లో స్టార్ అయినప్పటికీ పర్సనల్ జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి.. ఈయన చాలామంది హీరోయిన్లతో ఎఫై** పెట్టుకున్నారని అలాగే ఇప్పటికే ఇద్దర్ని పెళ్లి చేసుకొని ఒకరితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన విషయం తెలిసిందే.అలా మొదట వాణి గణపతిని పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చాక నటి సారికని పెళ్లి చేసుకున్నారు.వీరికి శృతిహాసన్, అక్షరా హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
Akshara Haasan sensational comments on parents diorce
ఇక సారికకు కూడా విడాకులు ఇచ్చేసి హీరోయిన్ గౌతమితో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇక ఈ రిలేషన్ కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. అంతేకాకుండా కమలహాసన్ కి శ్రీదేవి, శ్రీవిద్య, సిమ్రాన్, వంటి హీరోయిన్లతో ఎఫై వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయం పక్కన పెడితే తన తల్లికి విడాకులు ఇవ్వడం పై మొదటి సారి స్పందించింది కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ఆమె మాట్లాడుతూ..(Akshara Haasan)
Also Read: Hrithik Roshan: యంగ్ హీరోయిన్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. పదేళ్ళు డేటింగ్ చేసి!!
మేము మనుషులమే.. మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి..మా పేరెంట్స్ విడిపోయిన సమయంలో మేము ఎంతగానో బాధపడ్డాం. అయితే మా పేరెంట్స్ విడిపోయిన కూడా మా ఇద్దరికీ ఏ లోటు లేకుండా పెంచారు. భార్య భర్తలు గా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా మాత్రం వారి విధిని వారు నిర్వర్తించారు.
ఇక అమ్మానాన్న అందుబాటులో లేని సమయంలో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా అక్క దగ్గరికి వెళ్లేదాన్ని. దాన్ని మా అక్క సాల్వ్ చేసేది. మేమిద్దరం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఒకరికి ఒకరం అండగా నిలబడే వాళ్ళం.ఇప్పటికీ అలాగే ఉంటున్నాం అంటూ అక్షరా హాసన్ కమల్ హాసన్ సారిక విడిపోవడంపై మొదటిసారి స్పందించింది.(Akshara Haasan)