Puri Jagannadh sensational comments on lavanya

Puri Jagannadh: పూరి జగన్నాథ్ లావణ్య ల పెళ్లి చాలా వెరైటీగా జరిగింది అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఓ సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన లావణ్యకి పూరి జగన్నాథ్ అట్ట్రాక్ట్ అయ్యి ఆమెను ప్రేమించాడు. ఇక ఆమెకు విసిటింగ్ కార్డు ఇచ్చి ఫోన్ చేయమని చెబితే ఓ వారం రోజులకు లావణ్య కాల్ చేసి మీకు ఎప్పుడు ఇదే పనా.. ఇప్పటివరకు ఇలాంటి విసిటింగ్ కార్డులు ఎంతమంది అమ్మాయిలకు ఇచ్చారు అని అడిగిందట.

Puri Jagannadh sensational comments on lavanya

అలా ఇద్దరి మధ్య కొన్ని రోజులు ఫోన్ కాల్స్ నడిచాక ఓ రోజు బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారట. అయితే ఆ టైంలో పూరి జగన్నాధ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి మరీ లావణ్యను రెస్టారెంట్ కి తీసుకువెళ్లాడట. అక్కడికి వెళ్ళాక లావణ్య తందూరికోడి ఆర్డర్ చేయడంతో పూరి జగన్నాథ్ షాక్ లో మునిగిపోయారట. అయితే పూరికి తందూరి కోడి తినే అలవాటు లేదు.దాంతో తిన్నట్టు నటించాడట. (Puri Jagannadh)

Also Read: HBD Soundarya: సౌందర్య ఫస్ట్ లవ్ ఆ హీరోనేనా.. లవ్ లెటర్ కూడా రాసిందా.?

కానీ కొద్దిసేపట్లోనే తందూరి కోడి మొత్తం లావణ్య తినేసిందట. దాంతో ఆమె తిండిని చూసి షాక్ లో మునిగిపోయిన పూరి జగన్నాథ్ ఈమెను నేను పెళ్లి చేసుకుంటే పోషించగలనా.. వామ్మో వదిలేయడమే మంచిది కావచ్చు అని అనుకున్నారట.కానీ ఆ తర్వాత రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి ఇప్పటి నుండి మనం ఇలా షికార్లు చేయడం వద్దు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం.అలా అయితే రా అని చెప్పారట.ఆ తర్వా కొద్ది రోజులకు కాల్ చేసి వెంటనే పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు నిన్ను పోషించడానికి నా దగ్గర డబ్బులు లేవు.

Puri Jagannadh sensational comments on lavanya

కేవలం 200 మాత్రమే ఉన్నాయని అన్నారట.అయినా కూడా ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఇష్టం లేని పెళ్లి చేస్తారోనని భయపడ్డా లావణ్య పూరి జగన్నాథ్ సడన్గా పెళ్లి చేసుకుంది.ఆ టైంలో పూరి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆయన స్నేహితులు కొంతమంది తాళిబొట్టు, పెళ్లి బట్టలు వంటివి కొనిచ్చారట. ఇక లావణ్య పెళ్లి చేసుకున్నాక పూరి జగన్నాథ్ కి మంచి స్టార్డం వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యారు.లావణ్య తనకి అదృష్టం అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో పూరి జగన్నాథ్ భార్యని పొగుడుతూ చెప్పుకున్నారు.(Puri Jagannadh)