Nagarjuna: ఏంటి అక్కినేని నాగార్జునకు నాగచైతన్య అఖిల్ మాత్రమే కాకుండా నిఖిత అనే కూతురు కూడా ఉందా.. ఇప్పటివరకు ఈ అమ్మాయి బయట ఎందుకు కనిపించలేదు.. ఇన్ని రోజులు నిఖితను ఎక్కడ ఉంచారు.. అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ నిఖిత ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున,దగ్గుబాటి లక్ష్మికి విడాకులు ఇచ్చాక ఆమలని పెళ్లి చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చారు.ఇక లక్ష్మికి నాగచైతన్య, అమలకి అఖిల్ అనే కొడుకు ఉన్నారు.మరి నిఖిత ఎక్కడి నుండి వచ్చింది అని మీరందరూ అనుమానపడవచ్చు. అయితే నిఖిత అనే అమ్మాయి నిజంగా లేదు. అసలు నాగార్జునకు ఆడపిల్లలే లేరు.
Does Nagarjuna have a daughter named Nikhita
అయితే అసలు విషయం ఏమిటంటే.. నాగార్జున అమలని పెళ్లి చేసుకున్నాక అఖిల్ కడుపులో ఉన్న సమయంలో యూఎస్ లో ఉన్న డాక్టర్ స్కానింగ్ చేసి మీకు కూతురు పుడుతుంది అని చెప్పారట.దీంతో ఎంతో సంతోషంలో మునిగిపోయిన నాగార్జున ఎగిరి గంతేసి మరీ దేవుళ్ళని మొక్కుకొని హమ్మయ్య నాకు కూతురు లేదు అనే బాధ తీరబోతుంది అని అనుకున్నారట. క అమల ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఇండియా కంటే యూస్ లో ట్రీట్మెంట్ బాగుంటుందని అక్కడికే పంపించారట. ఆ తర్వాత ఆడపిల్ల అని తెలిసి యూస్ నుండి అమల తిరిగి వచ్చే సమయంలో అమ్మాయి పుడుతుంది కాబట్టి(Nagarjuna)
Also Read: Sridevi: ఒక్కరోజు శ్రీదేవితో ఆ పని చేయడం కోసం కోట్లు కుమ్మరించిన వ్యక్తి..ఎవరంటే..?
అమ్మాయి పేరు మీద కూడా టికెట్ బుక్ చేసి ఆ టికెట్ లో నిఖిత అనే పేరు కూడా ఫిక్స్ చేశారట. ఎందుకంటే తనకి అమ్మాయి పుడితే నిఖిత అనే పేరు పెట్టుకోవాలి అనుకున్నారట. అలా అన్ని పూర్తయ్యాక చివరికి అఖిల్ రెండు రోజుల్లో పుడతాడు అనగా అమల ఫోన్ చేసి నాకు కచ్చితంగా అబ్బాయే పుడతాడు కలలో అలాగే కనిపించింది అని అమల చెప్పిందట. దానికి నాగార్జున లేదు లేదు అమ్మాయి పుడుతుంది స్కానింగ్ రిపోర్ట్స్ లో అదే వచ్చింది కదా అని అన్నారట.అయినప్పటికీ అమల మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా అబ్బాయి పుడతాడు అని చెప్పింది.
ఇక తీరా చూస్తే అఖిల్ పుట్టాడు.దాంతో నాగార్జున చాలా నిరాశపడ్డాడట. అంతేకాదు స్కానింగ్ తీసి చూసి అమ్మాయి అని చెప్పాక కూడా అబ్బాయి ఎలా పుట్టాడు అని డాక్టర్ చీటింగ్ చేసింది కావచ్చు అని అనుకున్నారట.ఇక ఈ విషయం మొత్తాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అంతేకాదు తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, ఇంకో ప్రెగ్నెన్సీ చూద్దామని అమలతో అన్నా కూడా ఆమె మనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లే చాలు అని చెప్పిందట.అలా నాగార్జునకి ఆడపిల్ల కావాలి అనే కోరిక తీరలేదు.(Nagarjuna)