Kanchi Kaul: సంపంగి చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత అందమైన ప్రేమకథా చిత్రాలలో ఒకటి. సినిమా వచ్చిన సమయానికి ప్రేక్షకులు అందరూ కూడా బుల్లితెరకు అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారందరికీ ఈ సినిమా చూసేలా చేసింది. ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలను చాలా మంది వింటుంటారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. హిందూ, ముస్లిం కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడితే ఏమవుతుంది? ఈ రెండు సన్నిహిత కుటుంబాల పరిస్థితులు ఎలా తారుమారయ్యాయి అనే లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.
Sampangi Heroine Kanchi Kaul present situation
ఇందులో దీపక్ కథానాయకుడిగా, కంచి కౌర్ కథానాయికగా నటించారు. చంద్రమోహన్, చలపతిరావు, సన, శివాజీరాజా, రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి కాంచి కౌల్ తన అందం మరియు అభినయం తో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేసింది. ఈ చిత్రం తరువాత ఆమె “ఫ్యామిలీ సర్కస్”, ” మా అశోక్ గాడి లవ్ స్టోరీ” మరియు “శివరామరాజు” వంటి తెలుగు చిత్రాలలో నటించింది. అయితే తొలి సినిమాతోనే ఇంతటి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ దాన్ని తర్వాతి కాలం లో నిలబెట్టుకోలేకపోయింది. ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
Also Read: Nagarjuna: నాగార్జునకు నిఖిత అనే కూతురు ఉందా.. బయటపడ్డ సంచలన నిజం.?
కంచి కౌర్ మెల్లగా టెలివిజన్ వైపు అడుగులు వేసింది. తెలుగు లో పలు షోలు చేస్తూ హిందీలో కొన్ని సినిమాలు కూడా చేసింది. 2005లో, ఆమె ఏక్ లడ్కీ అంజనీ సి అనే టివి షో లో నటించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కంచి కౌర్ తెగ హల్చల్ చేస్తోంది. ఆమె తన భర్త మరియు పిల్లలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధిత ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెను చూసి షాక్ అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉన్న ఈ సంపంగి భామను సడెన్ గా చూసి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన కంచి కౌర్.. ఇప్పుడు మరింత అందంగా కనిపించడం ఇప్పుడు . ఇక కంచి కౌర్ భర్త కూడా నటుడే. టీవీ నటుడు షబ్బీర్ అహ్లూవాలియాను 2011లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు. కంచి కౌర్ భర్త షబ్బీర్ పలు సీరియల్స్ లో హీరోగా నటించాడు.
https://www.instagram.com/kanchikaul/?hl=en