Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈమెను చాలా మంది పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే మాట్లాడుతూ విడాకులు ఇచ్చినా కూడా ఆయనని అంటిపెట్టుకొని ఉండాలి అన్నట్టు సోషల్ మీడియాలో ఈమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారు.అంతే కాదు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు.

Renu Desai is going to meet her husband

కానీ రేణు దేశాయ్ మాత్రం ఎవరికి భయపడకుండా తన సొంత ఐడెంటిటీ తనకి ఉండాలి అనే విధంగా మాట్లాడుతుంది. అంతేకాదు రీసెంట్ గా ఓ వ్యక్తి మీరు పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇవ్వకపోయి ఉంటే బాగుండేది కదా వదిన. ఆయన అంతరంగం ఏంటో తెలియకుండా ఆయనకు విడాకులు ఇచ్చేసారు అంటూ పోస్ట్ పెట్టగా.. ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నేను మీ అన్నయ్యను వదిలేయలేదు ఆయనే నన్ను వదిలేసారు అంటూ చెప్పింది. అయితే ఇలాంటి కామెంట్లు ఇప్పటికే రేణు దేశాయ్ కి చాలానే ఎదురయ్యాయి.( Renu Desai)

Also Read: Pavitra: హీరోయిన్ల కంటే అందంగా పవిత్ర గౌడ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

అయితే గత కొద్దిరోజుల నుండి రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కి కాస్త ఫేవర్ గా ఉండడంతో చాలామందిని నెటిజన్స్ మీరు పవన్ కళ్యాణ్ తో మళ్ళీ కలవాలి అనుకుంటున్నారా.. మీ విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నారా.. అంటూ ఎన్నో కామెంట్లు పెడుతున్నారు.అయితే దీనిపై ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి క్లారిటీ ఇవ్వకుండా అందరికీ కలిపి ఒకే విధంగా కౌంటర్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేసింది.. అయితే ఆ వీడియో డిసెంబర్లో షేర్ చేయాల్సిందని, కానీ మర్చిపోవడం వల్ల ఇప్పుడు షేర్ చేస్తున్నానని చెప్పింది.

 Renu Desai is going to meet her husband

ఇక ఈ వీడియో కింద రేణు దేశాయ్ ఈ విధంగా రాస్కొచ్చింది. అదేంటంటే ఈ వీడియో పెట్టాక చాలామంది మీరు ఈ వీడియో ఇప్పుడు షేర్ చేయడానికి కారణం మీ మాజీ భర్తతో మళ్ళీ కలవాలనుకుంటున్నారా.. ఆయన్ని మర్చిపోలేకపోతున్నారా.. మీరు మళ్ళీ ఆయన్ని కలవండి..అంటూ ఎవరైనా ఉచిత సలహలిస్తే బాగుండదు. వారిని డిలీట్ చేసి బ్లాక్ లో పెడతాను జాగ్రత్త అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.( Renu Desai)