Amani about her marriage with soundarya Brother 

Amani: అలనాటి అందమైన తారలలో సౌందర్య ఒకరు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమను శాసించింది సౌందర్య. ఏ స్టార్ హీరో సినిమాకైనా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలనుకునేవారు. హీరోలకు ధీటుగా సినిమాల్లో నటించిన సౌందర్య చాలా మందికి ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. హీరోలకి సమానమైన పారితోషికం అందుకునే సౌందర్య కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రమ్య కృష్ణ, రంభ, మీనా, ఆమని వంటి స్టార్ హీరోయిన్లు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా అవకాశాలు అందుకుంటుంటే సౌందర్య మాత్రం గ్లామర్ ప్రదర్శన లేకుండా కేవలం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Amani about her marriage with soundarya Brother 

సౌంద‌ర్య ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాల‌మైనా ప్రేక్ష‌కులు ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటారు.  తాజాగా ఆమె స్నేహితురాలైన ఆమని సౌందర్య ను గుర్తు చేసుకుంది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులపై లోతైన ముద్ర వేసింది ఆమని. చాలా మంది పెద్ద హీరోలతో కలిసి పనిచేసిన ఆమని ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. రెండవ ఇన్నింగ్స్ లో ఆమని తల్లి, వదిన మరియు అత్త పాత్రలను పోషిస్తుంది. ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సౌందర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read: Raj Tharun: హీరోయిన్ తో చేసిన రొమాంటిక్ చాట్ లీక్.. రాజ్ తరుణ్ పరువు పోయింది గా!!

నేను సౌందర్యకు చాలా సన్నిహితంగా ఉంటాను… సౌందర్య కుటుంబానికి నేను చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. అయితే ఒకసారి, అయితే ఒకసారి సౌందర్య వల్ల నాన్న నన్ను తన కొడుకుని అంటే సౌందర్య అన్న అమర్ ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.  దీనితో నేను షాక్ అయ్యాను. నాకు ఏం చెప్పాలో అర్థం కావడంలేదు. సౌందర్య మరియు నేను ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. వెంటనే సౌందర్యకి మెసేజ్ చేసాను. కానీ సౌందర్య సోదరుడికి తన కాలేజీలో అప్పటికే ఓ ప్రేమ కథ ఉంది. ఈ విషయం వాళ్ల నాన్నకు తెలియదు. ఆ తర్వాత అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అని చెప్పింది