Andhra Pradesh: రాష్ట్రపతి పాలన విధించాలని ఏపీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. పల్నాడు జిల్లాలోని వినుకొండలో వైసీపీ కార్యకర్త అయిన రషీద్ ను.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. Andhra Pradesh
presidant rule in Andhra Pradesh
ప్రస్తుతం ఈ సంఘటన పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనే విషయం ఇంకా ఎవరికీ తెలియ రాలేదు. కానీ అంతలోనే ఏపీ అట్టుడుపుతోంది. బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి.. రషీద్ ఇంటికి వెళ్లారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. Andhra Pradesh
Also Read: Roja: జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన రోజా ?
ఈ సందర్భంగా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ…. బీహార్ కంటే దారుణంగా తయారైందని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నెలరోజుల సమయంలోనే 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Andhra Pradesh
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాసినట్లు వివరించారు. అలాగే రాష్ట్రపతిని కూడా త్వరలోనే కలిసి.. రాష్ట్రపతి పాలన విధించేలా డిమాండ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు వచ్చే బుధవారం నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లో… ధర్నాలు కూడా చేస్తామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. Andhra Pradesh