Namrata: మహేష్ బాబు భార్య కాకముందే నమ్రత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్..ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబుని పెళ్లి చేసుకునే కంటే ముందు మహేష్ బాబు కంటే నమ్రతనే పాపులర్.. ఎందుకంటే ఈమె హీరోయిన్ గానే కాకుండా మిస్ వరల్డ్ గా కూడా కిరీటాన్ని అందుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ చివరికి బాలీవుడ్ లో ఉన్న ఎంతోమందిని వదిలేసి టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని ప్రేమించి పెళ్లాడింది.

What is the Namrata dream

అయితే మహేష్ ని పెళ్లి చేసుకునే సమయంలో ఇండస్ట్రీలో మహేష్ కి అంత గుర్తింపు లేదు.కేవలం కృష్ణ కొడుకు గానే ఆయన సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడైతే పెద్ద స్టార్. కానీ ఇదంతా పక్కన పెడితే..నమ్రత సినిమాల్లోకి రాకముందు ఓ పని చేయాలనుకుందట.అంతేకాదు తనకి ఆ పని చేయాలనే డ్రీమ్ కూడా ఉండేదట.మరి ఇంతకీ నమ్రత ఏంటయ్యా అంటే.. ఎయిర్ హోస్టెస్ కావడం.. ( Namrata )

Also Read: Pawan Kalyan: పవన్ అలాంటివారా.. ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి రాక్షసానందం పొందేవారా.?

ఎయిర్ హోస్టెస్ అంటే చాలామంది అమ్మాయిలకు ఇష్టమైన పని . అయితే అందరి లాగే నమ్రత కూడా ఎయిర్ హోస్టెస్ కావాలి అనే కోరిక ఉండేదట. ఎయిర్ హోస్టెస్ కావాలని ఎన్నో రోజులు అనుకుందట. కానీ చివరికి ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఆమె కోరికని ఓ వ్యక్తి మధ్యలోనే అడ్డగించింది.ఆమె ఎవరో కాదు నమ్రత తల్లి. అయితే నమ్రత కోరికను తన తల్లి కాదనడానికి కారణం అప్పట్లో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.

What is the Namrata dream

అందుకే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయన్న భయంతోనే నమ్రతకి ఉన్న డ్రీమ్ ని వదిలేసుకోమని నమ్రత తల్లి బెదిరించిందట. ఇక తల్లి మాట కాదనలేక నమ్రత సినిమాల్లోకి హీరోయిన్గా వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు భార్యగా సినిమాలకు కూడా పులిస్టాప్ పెట్టి బిజినెస్ లు, ఇతర వ్యవహారాలు అలాగే ఇంటిని చక్కబెడుతూ మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది.( Namrata )