Sania Mirza second marriage with that cricketer

Sania Mirza: సానియా మీర్జా ఎప్పుడైతే తన భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుందో అప్పటినుండి సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల విడాకులకు కారణం ఓ తెలుగు హీరో అని కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సానియా తన బంధంలో నిజాయితీగా ఉన్నప్పటికీ షోయబ్ మాలిక్ మాత్రం పాకిస్తాన్ బుల్లితెర నటి అయిన సనా జావేద్ తో రిలేషన్ పెట్టుకోవడంతో వీరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది.

Sania Mirza second marriage with that cricketer

అలా సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు విడాకులు తీసుకున్నారు.అయితే గత సంవత్సరం మొదటి నుండే ఈ వార్తలు వినిపించినప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ జంట తమ విడాకుల వార్తను బయటపెట్టింది.అలాగే కూడా షోయబ్ కూడా సనా జావేద్ ని మూడో పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడంతో సానియా మీర్జాని కూడా రెండో పెళ్లి చేసుకోమని చాలామంది ఇంట్లో వాళ్ళతో పాటు బయటి వాళ్లు,ఫ్రెండ్స్ ఇలా అందరు అంటున్నారట. ఇక ఓ షోలో కూడా ఓ నటుడు ఇక్కడితో ఆగిపోకూడదు.(Sania Mirza)

Also Read: Hardik Pandya: ఆ అమ్మాయితో బెడ్‌ రూంలో దొరికిపోయిన పాండ్యా..?

మళ్లీ పెళ్లి చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలి అని కూడా చెప్పారు. అయితే గత కొద్ది రోజుల నుండి సానియా మీర్జా ఇండియన్ స్టార్ క్రికెటర్ అయినటువంటి మహమ్మద్ షామీ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మహమ్మద్ షమీ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వడంతో ఇద్దరు ఒంటరిగా ఉన్నారు.కాబట్టి సానియా షమీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కొంతమంది ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు క్రికెటర్ షమీ.

Sania Mirza second marriage with that cricketer

ఆయన మాట్లాడుతూ నా రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అలాగే ఇలాంటి రూమర్స్ ప్రచారం చేసే వారిపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి మీమ్స్ సోషల్ మీడియాలో పెడితే మీకు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది కానీ వాటి వల్ల కొంతమందికి హాని కూడా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి.ఇలాంటి అసత్య ప్రచారాలను వైరల్ చేయకుండా వాటికి దూరంగా ఉండటం మంచిది అంటూ చెప్పారు. దాంతో సానియా మీర్జాతో రెండో పెళ్లి వార్తలు షమీ క్లారిటీతో సర్దుమణిగాయి.(Sania Mirza)