Kohli: ఇండియన్ స్టార్ క్రికెటర్ అయినటువంటి కోహ్లీ అనుష్క శర్మతో పెళ్లి కంటే ముందే కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నారనే సంగతి మనకు తెలిసిందే. అయితే క్రికెటర్స్ కి సినీ ఇండస్ట్రీ వాళ్ళకి విడదీయలేని అనుబంధం ఉంటుందో ఏమో తెలియదు కానీ చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ ని ప్రేమించారు.అయితే అలాంటి స్టార్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ అప్పట్లో తమన్నా భాటియాతో ప్రేమలో ఉన్నారనే రూమర్ ఇంటర్నెట్లో ఎంతగా చక్కర్లు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Kohli love with that heroine
అయితే వీరిద్దరి మధ్య ఈ లవ్ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం తమన్నా విరాట్ కోహ్లీ కలిసి ఒక యాడ్ లో నటించారు. ఇక ఆ యాడ్లో నటించ్చినప్పటి నుండి వీరి మధ్య బంధం కొనసాగిందని,చాలా రోజులు డేటింగ్ చేశారనే రూమర్స్ వినిపించాయి.కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు వీరి డేటింగ్ వార్తలు ఆగిపోయి అనుష్క శర్మతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో తమన్నా తో విరాట్ కోహ్లీ ఎఫైర్ వార్తలను ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఖండించలేదు. (Kohli)
Also Read: Divorce: చైతూ-సామ్, ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటారని ముందే చెప్పిన స్టార్ హీరో.?
దాంతో అందరు ఇది నిజమే అనుకున్నారు. అయితే ఈ రూమర్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్నా క్లారిటీ ఇస్తూ.. నేను విరాట్ కోహ్లీ తో చేసిన ఆ యాడ్ సమయంలో తప్ప ఆ తర్వాత ఆయన్ని మళ్లీ ఎప్పుడు కలిసింది లేదు.మళ్ళీ మాట్లాడింది లేదు.కానీ ఈ రూమర్స్ ఎందుకు వైరల్ చేశారో నాకు తెలియదు. అలాగే ఈ విషయం అనుష్క శర్మ కి కూడా తెలుసు.వారిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగా ఉండాలి అని చెప్పింది..
అయితే తాజాగా నెట్టింట్లో అనుష్క శర్మ కోహ్లీలకు సంబంధించిన ఆ యాడ్ మరొకసారి వైరలవ్వడంతో ఈ యాడ్ చూసిన కొంతమంది నెటిజన్స్ ఫన్నీగా అనుష్క బాబి విరాట్ అన్న తమన్నా మాయలో పడిపోయారు. జర జాగ్రత్తా అంటూ ఆమెని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Kohli)