Tollywood: వచ్చే నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్త సినిమాల విడుదల లు భారీ గా ఉన్నాయి. . ఒకేరోజు ఎక్కువ సినిమాల విడుదలలు ప్రభావితం అవుతాయని తెలిసినా లాంగ్ వీకెండ్‌ను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడడంలేదని కాంపీటీషన్ బట్టి తెలుస్తుంది. గురువారం రోజునుంచి హాలీడే కాబట్టి ఆ నాలుగు రోజులు క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ఆ రోజు కోసం ఎగబడుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే చాలు థియేటర్ లలో కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ఎవరికి వారు కాంప్రమైజ్ కాకుండా కంటెంట్‌పై నమ్మకంతో ఆరోజు తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అందులో పోటీపడుతున్నవి తక్కువ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.

Tollywood Releases on August 15

డైనమిక్ స్టార్ రామ్ పోతినేని మరియు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కలిసి చేస్తున్న “డబల్ ఇస్మార్ట్” పై అంచనాలు రోజు రోజు కి పెరుగుతున్నాయి. విడుదలైన రెండు పాటలు మంచి ఆదరణ పొందడంతో పాటు కంటెంట్ కూడా ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా ఆగస్ట్ 15 న రావడం ఖాయమని చెప్పాలి. ఆ డేట్ ను వారు ఎప్పుడో లాక్ చేసుకున్నారు. ఇక గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న “ఆయ్” సినిమా ను ఈ తేదీకే తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రమోషన్స్ పై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కు మేకర్స్ మరింత బడ్జెట్ ను కేటాయించారట. ఎన్టీఆర్ బావమరిది నవీన్ నార్నేకి ఈ సినిమా ఎంతో కీలకం.

Also Read: Amla: ఉసిరికాయ రోజుకు ఒకటి తింటే 100 రోగాలకు చెక్‌..రాత్రి మగాళ్లు కూడా రెచ్చిపోతారు ?

ఇక నివేదా థామస్ నటించిన “35 చిన్న కథలు” కూడా రేసు లో ఉంది. ప్రమోషన్స్ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే వచ్చిన విజువల్స్ చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది. ఇవన్నీ టాలీవుడ్ నుండి వచ్చిన స్ట్రెయిట్ సినిమాలే. ఇంకా డబ్బింగ్ సినిమా లు కూడా ఆరోజునే వస్తున్నాయి. విక్రమ్ ‘తంగళన్’ అధికారికంగా బరిలోకి దిగడంతో పోటీ మరింత తీవ్రంగా మారింది. ట్రైలర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. ఇదే కాకుండా, రవితేజ కూడా గస్టు 15 న తను నటిస్తున్న మిస్టర్ బచ్చన్‌ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు, దీనిపై ఓ క్లారిటీ రాలేదు. ఏదేమైనా పలు సినిమాలతో ఈ ఆగస్టు 15 ఆసక్తికరంగా మారింది.