Telangana: తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించేలా… చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… కొత్తగా తెరపైకి తీసుకువచ్చాడు. వాస్తవానికి… ఏపీలో వైసిపి నేత రషీద్ హత్య జరిగిన నేపథ్యంలో… ఏపీలో రాష్ట్రపతి పాలన వేయాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీకి అలాగే రాష్ట్రపతికి కూడా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. Telangana

President rule in Telangana and AP

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసి… రాష్ట్రపతి పాలన వేసేలా చర్యలు తీసుకోవాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది గులాబీ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది. డీఎస్సీ అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేవారు మొన్నటి వరకు నిరసనలు తెలిపారు. Telangana

Also Read: Jagan: వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బహిష్కరణ ?

ఈ నేపథ్యంలో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులపై లాఠీ చార్జ్ కూడా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా హైదరాబాదులో వరుసగా… హత్యలు జరుగుతున్నాయి. రోజుకు రెండు చొప్పున మర్డర్స్ చేస్తున్నారు.. దుండగులు. దీంతో హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్య వచ్చిందని తాజాగా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు కేటీఆర్. Telangana

అలాగే గులాబీ పార్టీ నేతలను బెదిరించి… పదిమందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్నారని రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు గులాబీ పార్టీ నేతలు. ఒకవేళ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ స్పందించకపోతే… వెంటనే రాష్ట్రపతికి వెళ్లి కలుస్తామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా రాష్ట్రపతి పాలన వేయాలని కూడా కోరుతామన్నారు. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన… హాట్ టాపిక్ అయింది. Telangana