Radha Ravi: Aswini Dutt didn't give the film a chance saying "I am a low caste"

Radha Ravi: వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అయినటువంటి అశ్వినీ దత్ అందరికీ తెలిసే ఉంటారు.ఈయన అప్పట్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో తీసి స్టార్ నిర్మాతగా కొనసాగారు. అయితే రీసెంట్గా వచ్చిన కల్కి 2898ad మూవీ కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఆయన కూతుర్లు ప్రియాంక దత్,స్వప్న దత్ లు నిర్మించారు. అయితే అలాంటి అశ్వినీ దత్ కి కుల పిచ్చి ఎక్కువ అని ఇప్పటికే చాలా సందర్భాలలో కొంతమంది నటీనటులు బయటపెట్టారు. ముఖ్యంగా కుల పిచ్చి ఉన్న అశ్వినీ దత్ తన కూతుర్లకి వేరే కులం కి చెందిన అల్లుళ్లని ఎలా తీసుకొచ్చుకున్నారు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.

Radha Ravi: Aswini Dutt didn’t give the film a chance saying “I am a low caste”

అయితే ఆయన కూతుర్లు ఇద్దరు వేరే కులానికి చెందిన అబ్బాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే అశ్వినీ దత్ కి కుల పిచ్చి ఎక్కువ. నా కులం తక్కువ అని నాకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదు అంటూ సంచలన కామెంట్లు చేశారు తమిళ సీనియర్ నటుడు రాధా రవి.ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొత్తం రాఘవేందర్రావు గారు చెప్పినట్లే వినే వాడిని. (Radha Ravi)

Also Read: Urvasi Rautela: ఊర్వశి రౌటేలా బాత్రూం వీడియో లీక్ చేసింది వాళ్లేనా.?

అలా ఓసారి అశ్వినీ దత్ వెంకటేష్ హీరోగా చేసిన కలియుగ పాండవులు సినిమాలో ఆర్టిస్ట్ కోసం నన్ను సంప్రదించారు.దాంతో నేను రాఘవేంద్రరావుకి మొత్తం తెలుసు అని చెప్పాను. ఆ తర్వాత అశ్వినీ దత్ నన్ను అసిస్టెంట్ కి చెప్పి సినిమాలో బుక్ చేయమని చెప్పారు.అలా చెప్పిన వెంటనే మీ కులం ఏంటి అని నన్ను అడిగారు. దానికి నేను ఏమో నాకు అంత కరెక్ట్ గా తెలియదు కానీ బలిజ నాయుడు కావచ్చు అని చెప్పాను.దాంతో నా కులం ఏంటో తెలుసుకున్న అశ్వినీ దత్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

Radha Ravi: Aswini Dutt didn't give the film a chance saying "I am a low caste"

ఆ తర్వాత నన్ను ఆ సినిమా నుండి తీసేసారు. అంతేకాదు ఆయన బ్యానర్ లో చేసే సినిమాలన్నింటి నుండి నన్ను తొలగించేశారు. ఇక ఈ విషయాన్ని నేను రాఘవేంద్రరావు దగ్గర చెబితే అసలాయన ఎందుకుఅలాంటి పని చేశారు అని అడిగారు. కానీ ఆయన ఎందుకు అలా చేశారో నాకు అప్పుడు అర్థమైంది.కేవలం నా కులం వల్లే ఆయన నన్ను తన సినిమాలన్నింటి నుండి తీసేశారు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాధా రవి.(Radha Ravi)