Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. గత కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యాకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పాండ్యా వైవాహిక బంధం ముగిసిపోయింది. తన భార్య నటాషాకు పాండ్యా విడాకులు ఇచ్చాడు. నటాషా సెర్బియాకు చెందిన అమ్మాయి. Hardik Pandya

Gambhir gave another condition to Hardik Pandya

సినిమాల మీద ఉన్న ఆసక్తితో బాలీవుడ్ నటిగా తన సత్తాను చాటుకుంది. ఇక హార్దిక్ పాండ్యా, నటాషా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరు వివాహానికి ముందే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక గత సంవత్సరం వీరు హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. Hardik Pandya

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యకు 95 కోట్ల భారీ నష్టం ?

అయితే ఇప్పుడు వీరు రీసెంట్ గా విడాకులు తీసుకున్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లలో ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్లిపోయింది. తమ మూడేళ్ల కుమారుడు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా నిర్వర్తిస్తామని హార్దిక్ పాండ్యా తెలియజేశాడు. కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ అసలు కుదరలేదని….. నాలుగేళ్లు కలిసున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని…. తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నామని చెప్పాడు. అగస్త్య తనతో లేకపోయినందుకు చాలా బాధగా ఉందని హార్దిక్ పాండ్యా బాధపడుతున్నాడు. ఇప్పటికే విడాకుల బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. Hardik Pandya

టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పాండ్యాకు కొత్త కండిషన్ పెట్టాడు. 2025 ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇక ఇందులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కాలంటే….దేశవాళీ వన్డే క్రికెట్ లో పాండ్యా తన బౌలింగ్ సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలి. లేకపోతే పాండ్యాని ఎంపిక చేయరు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి పాండ్యా షాక్ లో ఉన్నారు. Hardik Pandya