Do you know what Niharika did for that hero

Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం నిహారిక సమర్పణలో కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ ఆగస్టు 9న విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. టీజర్,గ్లింప్స్, పాటలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగి పోయాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

Do you know what Niharika did for that hero

ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పింది.నిహారిక మాట్లాడుతూ.. పవన్ బాబాయ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చాలా సంతోషపడ్డాం. ఆయన గెలవడం కాదు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఆనందించాం.అలాగే పవన్ బాబాయ్ నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ అంటూ ఏం లేదు. కానీ అకిరాకు రాఖీ కట్టిన సమయంలో ఓ చెట్టు బహుమతిగా ఇచ్చారు. (Niharika)

Also Read: Abhishek Bachchan: తండ్రితో రొమా** చేసిందని ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని అభిషేక్ బచ్చన్..?

అది నాకు చాలా స్పెషల్. ఇక పవన్ బాబాయ్ పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్ అనే విషయం తెలిసాక ఆయన నెంబర్ నా ఫోన్లో కేకేకే అని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అని చెప్పింది. అలాగే ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు సినిమాలు ఒకే టైంలో విడుదలయితే మీరు ముందుగా చూసేది ఎవరి సినిమా అని యాంకర్ అడగగా..

Do you know what Niharika did for that hero

నేను పెదనాన్న మూవీ చూస్తాను అంటూ నవ్వుతూ చెప్పింది.అలాగే మీరు పవన్ కళ్యాణ్ కి సంబంధించిఏ సినిమాని కాలేజ్ బంకు కొట్టి మరీ చూసారు అని అడగగా.. జల్సా సినిమాను నేను కాలేజ్ బంకు కొట్టి మరీ చూశాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.