Bunny took Sukumar word on that matter.. Big secret that no one knows

Sukumar: అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి బంధం ఆర్య మూవీ టైమ్ లో బలపడింది.అప్పటినుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వీరి కాంబినేషన్లో ఇప్పటికే ఆర్య,ఆర్య 2,పుష్ప వంటి సినిమాలు వచ్చాయి.ఇక త్వరలోనే పుష్ప -2 కూడా రాబోతుంది. అయితే పుష్ప 2 వస్తే వీరి కాంబోలో ఇది నాలుగవ సినిమా. ఇక వరుస సినిమాలు సుకుమార్ బన్నీ తో చేయడానికి ఒక కారణం ఉందట.

Bunny took Sukumar word on that matter.. Big secret that no one knows

ఆరోజు అల్లు అర్జున్ కి సుక్కు ఇచ్చిన మాట కోసమే ఇదంతా చేస్తున్నారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఆర్య సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు లెక్కల మాస్టర్ సుకుమార్. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సుకుమార్ కి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం నది దగ్గర షూట్ చేసారు. అయితే ఆ టైంలో పడవలో కూర్చున్న సమయంలో పడవకు చిల్లు పడి నీళ్లన్నీ పడవలోకి వచ్చేసాడట.(Sukumar)

Also Read: Mahesh-Namrata: మహేష్-నమ్రత ల పెళ్లి ఆమె చెడగొడుతుందని భయపడి సీక్రెట్ గా చేసారా.?

పడవలో ఉన్న వాళ్ళందరూ ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారట.కానీ సుకుమార్ కి ఈత రాకపోవడంతో అందులోనే పడిపోయారట. ఇక ఆ టైంలో సుకుమార్ ని అల్లు అర్జున్ నీళ్లలో నుండి కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారట.ఆ టైం లోనే సుకుమార్ నా ప్రాణాలు కాపాడవు నీ రుణం తీర్చుకోలేను అని ఎమోషనల్ కామెంట్స్ చేశారట. దాంతో అల్లు అర్జున్ రుణం ఏమి అవసరం లేదు.

Bunny took Sukumar word on that matter.. Big secret that no one knows

కానీ మీరు నాతో ఏడు సినిమాలు చేస్తానని మాట ఇవ్వండి అని అనడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సుకుమార్ కచ్చితంగా నీతో ఏడు సినిమాలు చేస్తాను అని మాట ఇచ్చారట.అలా ఇచ్చిన మాట ప్రకారం సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్ తో నాలుగు సినిమాలు చేశారు. మరో మూడు సినిమాలు కూడా చేస్తారు. అందుకే అల్లు అర్జున్ సుకుమార్ మధ్య బంధం అంత బలంగా ఉంటుందట.(Sukumar)