Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ తండ్రి దివంగత నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు అంటే ఎవరికి తెలియదు. అయితే ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారికి అప్పటి జనరేషన్ వాళ్లకు మాత్రమే ప్రభాస్ తండ్రి తెలుసు. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు ప్రభాస్ తో ఉన్న కొన్ని పాత ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది. అయితే అలాంటి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ ఇండస్ట్రీలో గోపికృష్ణ బ్యానర్ లో కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే అలాంటి సూర్యనారాయణ రాజు నిజంగానే ఆ ప్రొడ్యూసర్ ని చంపాలని కుట్ర చేశారా? ఎందుకు అలా పగ పెంచుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
Did Prabhas father conspire to kill that producer
ప్రభాస్ ది రాజుల వంశం. ఇక ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణంరాజు తమ్ముడే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు. అలా అన్నదమ్ముల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది. ఇక కృష్ణంరాజును ఏదైనా విషయంలో ఎవరైనా మాట అంటే కూడా సూర్యనారాయణ రాజు అస్సలు ఓపికతో ఉండేవారు కాదట.వారి మీదకు వెళ్లి మరీ దాడి చేసే అంత కోపంతో ఊగిపోయేవారట.అలా ఓ సమయంలో కృష్ణంరాజు కోసం ఓ నిర్మాతను చంపాలని కూడా ప్లాన్ వేశారట.ఇక ఆ నిర్మాత ఎవరంటే జి ఎస్ రాజు.. అయితే కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..( Prabhas)
Also Read: Sukumar: ఆ విషయంలో సుకుమార్ దగ్గర మాట తీసుకున్న బన్నీ.. ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్.?
నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత నాతో సినిమా తీస్తానని20,000 అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు.ఆ తర్వాత కొద్ది రోజులకే వేరే హీరోని తమ సినిమాలో అనుకున్నారు. అయితే ఆ నిర్మాత మరో డైరెక్టర్ తో కలిసి నా సినీ కెరీర్ మీద కుట్ర చేశారు. నన్ను ఆ మూవీ నుండి తప్పించి వేరే నటుడికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ నేను ఎలాంటి రచ్చ చేయలేదు. కానీ నాకు ఇచ్చిన 20,000 అడ్వాన్స్ కోసం ఇండస్ట్రీలో పెద్ద రచ్చ చేసేసి నన్ను అప్పటి ఇండస్ట్రీ పెద్దమనిషి అయినటువంటి జీవీఎస్ రాజు దగ్గరికి పిలిపించి అడిగారు. అయితే నేను ఎలాంటి గొడవ పెట్టుకోకుండానే వారికి 20,000 ఇచ్చేసాను.
అయితే నాపై సినీ ఇండస్ట్రీలో కుట్ర జరుగుతుందనే విషయం నా తమ్ముడు తెలుసుకున్నాడు.దాంతో ఆయనకు నేరుగా ఓ విషయం చెబుతూ.. అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసాను.వారితో నాకు ఎటువంటి గొడవ లేదు.కానీ నాపై కుట్ర చేసి నా సినీ కెరీర్ని దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం నా తమ్ముడు ఊరుకోడు.ఇప్పటికే వాన్ని నేను కంట్రోల్ చేశాను.మళ్లీ ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం కచ్చితంగా వాడు చంపడానికి వెనకాడడు.ఇది ఇలాగే కొనసాగితే మాత్రం వాడు చంపేస్తాడు అంటూ ఆ నిర్మాత,డైరెక్టర్ ఉన్న సమయంలోనే నేను వార్నింగ్ ఇచ్చా అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అలా కృష్ణంరాజును ఇండస్ట్రీలో ఉన్నవారు ఏమన్నా కూడా ప్రభాస్ తండ్రి సైలెంట్ గా ఉండకుండా వారిపై గొడవకి వెళ్లేవారట.( Prabhas)