Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…ప్రస్తుతం వైసీపీ కార్యకర్త రషీద్ హత్య కేసు సంఘటన…వివాదంగా మారింది.రషీద్ హత్య కేసు చుట్టే ఏపీ రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. పల్నాడు లోని వినుకొండ లో ఈ సంఘటన జరిగింది. ఇక రషీద్ కుటుంబాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్లి కూడా పరామర్శించారు. Jagan
Rahul Gandhi in the field for Jagan
అంతేకాదు..ఇదే సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే సంఘటనను సాకుగా చూపి… ఢిల్లీకి కూడా వెళ్తున్నారు వైసీపీ ఎంపీలు.ఎంపీలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు 36 హత్యలు జరిగాయని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. Jagan
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మేడిగడ్డ దెబ్బ.. మళ్లీ లేస్తున్న కేసీఆర్ ?
ఆంధ్రప్రదేశ్ కాస్త హత్య ఆంధ్రప్రదేశ్…అయిందని… చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను , దౌర్జన్యాలను దేశవ్యాప్తంగా తెలిసేలా ఢిల్లీలో… ధర్నాలు చేస్తామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను కలుస్తామని స్పష్టం చేశారు. Jagan
ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా జత చేసుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీని కలిసి… వారి సపోర్ట్ కూడా తీసుకోనున్నారట జగన్మోహన్ రెడ్డి. అయితే.. దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో.. చూడాల్సి ఉంది. ఏపీలో బిజెపి కూటమి ఉన్న నేపథ్యంలో కచ్చితంగా రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారని అంటున్నారు.