KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గులాబీ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ… జారుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు…జంప్ అవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంపు కాగా… తాజాగా మరో గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. KCR
Big shock for KCR 20 more MLAs jump to Congress
ఇప్పటివరకు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లేటెస్ట్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలే కాకుండా మరో 20 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు… కాంగ్రెస్లో చేరతారని దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న దానం నాగేందర్… జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు…. గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతారని ఆయన బాంబు పేల్చారు. KCR
Also Read: KTR: కన్ఫూజెన్ లో బాబును జోకుతున్న రామారావు..?
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, వివేకానంద రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, కాల యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇలా హైదరాబాద్ మహానగరంలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేర్తారని ఆయన బాంబు పేల్చారు. ఇక ఇప్పటికే ఉప్పల్ ఎమ్మెల్యే…. జానారెడ్డి తో సమావేశమయ్యారు. KCR
రెండు రోజులు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రకాశ్ రెడ్డి గులాబీ పార్టీ వీడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉన్నచోట ఈ ఎమ్మెల్యేలు… మారడం ఖాయమని… ఎంత చెప్పినా ఈ ఎమ్మెల్యేలు వినరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులను… ప్రజలు ఎన్నుకోకూడదని కోరుతున్నారు. మరి ఇలాంటి ప్రళయాన్ని కేసీఆర్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. KCR