Manchu Lakshmi: మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ తాజాగా అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంటస్ చేసింది.ఆయన క్యారెక్టర్ అస్సలు బాలేదంటూ ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోయాయి. అయితే మంచు లక్ష్మి ఎందుకు అల్లు అర్జున్ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పింది. అసలు అల్లు అర్జున్ లో ఆమెకు నచ్చని గుణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. విభిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైకి మకాం మార్చిన సంగతి మనకు తెలిసిందే.
Manchu Lakshmi: Allu Arjun Character Very Bad
అయితే బాలీవుడ్లో అవకాశాల కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీకు పుష్ప,బాహుబలి రెండు సినిమాల్లో ఏదంటే ఇష్టం అని అడగగా..నాకు బాహుబలి అంటే ఇష్టం అని చెప్పింది. పుష్ప ఎందుకు ఇష్టం లేదు అని యాంకర్ అడగగా.. ఈ విషయం చెబితే వివాదం అవుతుందేమో కానీ చెబుతాను.(Manchu Lakshmi)
Also Read: Mehreen: మెహ్రీన్ పెళ్లి చెడగొట్టింది ఆ కోలీవుడ్ హీరోనా.. ఎంత చెప్పినా వినకుండా ఆ పని చేసి.?
ఐ లవ్ పుష్ప.. ఐ లవ్ అల్లు అర్జున్.. కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పాత్ర నాకు నచ్చలేదు. అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో పుష్ప పాత్రలో అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయడం అస్సలు నచ్చలేదు. ఇక ఇలాంటి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తే పల్లెటూర్లో ఉండే చాలామంది ఆయన అభిమానులు కొంతమంది అల్లుఅర్జునే చేశారు మనమెంత అనే విధంగా వాళ్లు కూడా అలాగే తయారవుతారు.
అయితే ఈ విషయం నాకు కాస్త బాధనిపించింది. ఇక ఈ సినిమా బాగ లేదని కాదు.పుష్ప చాలా అద్భుతంగా ఉంది. కానీ నాకు నచ్చాలని లేదు.ఎవరి ఇష్టం వారిది అంటూ మంచు లక్ష్మి ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి మంచు లక్ష్మి చేసిన కామెంట్లను అల్లు అర్జున్ అభిమానులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.(Manchu Lakshmi)